సూపర్ స్టార్ వదినకు ప్రమాదం

Mahesh Babu sister-inlaw injured in shooting

11:20 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Mahesh Babu sister-inlaw injured in shooting

ప్రమాదం చెప్పి రాదనీ అంటారు కదా. ఇదిగో సూపర్ స్టార్ మహేష్ బాబు వదిన శిల్పా శిరోద్కర్(నమ్రతశిరోద్కర్ అక్క) విషయంలో అదే జరిగింది. ఆమె ఓ షూటింగులో గాయపడింది. హిందీ సీరియల్ ‘సిల్ సిలా ప్యార్ కా' లో షూటింగులో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. డైలాగ్స్ చెప్పే క్రమంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు ఆమె జారి కిందపడిపోవడంతో వెంటనే యూనిట్ మెంబర్స్ ఆమెను ఆసుపత్రికి తరలించారట. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో బెడ్ మీదనే రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించారట. త్వరలోనే ఆమె కోలుకొంటారని చెప్తున్నారు. గాయపడ్డ తన సోదరిని చూసేందుకు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా వెళ్ళింది.

అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తూ ఆమె వెన్నెముక కు ఎలాంటి ఫ్యాక్చర్ అవ్వలేదు. ఒక వేళ వెన్నెముక కు ఫ్యాక్చర్ అయి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదట. త్వరలో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి పరామర్శిస్తాడని టాక్.

English summary

Mahesh Babu sister-inlaw injured in shooting. Mahesh Babu wife Namrata Shirodkar's sister Shilpa Shirodkar injured in hindi serial shooting.