నాని కోసం క్యూలో మంజుల

Mahesh Babu Sister Manjula To Direct Nani

01:38 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Mahesh Babu Sister Manjula To Direct Nani

షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్ తదితర చిత్రాలలో నటించి మరోవైపు నిర్మాతగానూ నాని, ఏ మాయ చేశావే వంటి సినిమాలు చేసిన మహేశ్ సోదరి మంజుల మెగాఫోన్ పట్టబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో నాని హీరోగా నటించనున్నట్టు టాక్. ఇప్పటికే నానితో చర్చలు కూడా జరుపగా అతడు సుముఖత తెలిపాడట. మరి ఈ సినిమా మంజుల స్వయంగా నిర్మిస్తుందా, వేరే బ్యానర్లో చేస్తుందా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మరోపక్క నాని కోసం ఇప్పటికే దాదాపు అరడజను మంది దర్శకులు కాచుకుని ఉన్నారు. వారిలో ఉయ్యాల జంపాల దర్శకుడు విర్మించి వర్మ, సినిమా చూపిస్తా మావా దర్శకుడు త్రినాథరావు నక్కిన, భలే మంచి రోజు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య వంటి వారున్నారు. మరోవైపు నాని ప్రాణ స్నేహితుడు - నటుడు కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల కూడా నానితో ఓ సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఆ క్యూలో మంజుల కూడా వచ్చి చేరింది. అయితే నాని ముందుగా ఎవరితో చేయి కలుపుతాడో చూడాలి. కాగా జూన్ 17న నాని జెంటిల్‌మన్‌ గా రాబోతున్నాడు.

ఇవి కూడా చదవండి:బాహుబలి, అరుంధతిలను మించిపోయిన టీజర్(వీడియో)

ఇవి కూడా చదవండి:ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

English summary

Tollywood Super Star Mahesh Babu's Sister Manjula Who had directed and acted in Some films was going to direct Natural Star Nani.