మహేష్ తన డబ్బుని ఇలా ఖర్చు చేస్తున్నాడా!!

Mahesh Babu spending his money like this

01:49 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Mahesh Babu spending his money like this

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మహేష్‌ వ్యవహరిస్తున్నాడు. వ్యాపార ప్రకటనలో తీరిక లేకుండా సంపాదిస్తున్నాడట మహేష్‌. ఇలా సంపాదించిన దాంట్లో 30 శాతం డబ్బుతో కొన్ని సేవాకార్యక్రమాలు చేస్తున్నాడట. వృద్ద ఆశ్రమాలకూ, అనాధులకూ, చిన్న పిల్లలకూ మరియు ఇతర సేవాకార్యక్రమాలకు ఈ డబ్బు వినియోగిస్తున్నాడట. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ మహేష్‌ భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటుందట. ఈ విషయాన్ని కమీడియన్‌ ఆలీ ఒక టి.వి. షోలో తెలిపాడు.

మహేష్‌ ద్వారా ఈ విషయాలను తెలుసుకున్నాడు ఆలీ. సంపాదించిన డబ్బుతో కొంతశాతం డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా మహేష్‌ ది ఎంత గొప్ప మనసో అర్ధమౌతుంది. ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

English summary

Super Star Mahesh Babu spending his money for orphanage homes, oldage homes and Children hospitals.