దత్తత గ్రామ అభివృద్ధికి 'శ్రీమంతుడు' తొలి అడుగు

Mahesh Babu To Develop His Adopted Village

09:53 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Mahesh Babu To Develop His Adopted Village

గ్రామ సీమలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధి ఆనాడే చెప్పారు. కేంద్ర సర్కార్ కూడా ఆ దిశగా ప్రజా ప్రతినిధులు , సంపన్నులు ప్రతి ఒక్కరూ ఏదో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సూచిస్తోంది. ఇక సినిమా పరంగా 'శ్రీమంతుడు' మరో అడుగు ముందుకేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటూ అడ్డువచ్చే శక్తుల ఆటకూడా కట్టించిన సంగతి తెల్సిందే. అయితే నిజ జీవితంలో కూడా ఈ 'శ్రీమంతుడు' గ్రామాన్ని దత్తత తీసుకుని సమగ్రాభివృద్ధి కి నడుం కడుతున్నాడు.

సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

చేతులతో ఇలా చేయగలరా మీరు ?

షకలక శంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్

1/5 Pages

సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్‌, సోదరి పద్మ రాక ...

   సొంత ఊరు అయిన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న 'శ్రీమంతుడు' మహేష్బాబు ఇప్పుడు గ్రామాభివృద్ధిలో తొలి అడుగు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో అవసరాలు, చేయాల్సిన కార్యక్రమాలపై ఒక అవగాహనకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ ఇందుకు తగిన ప్రణాళిక రెడీ  చేస్తున్నాడు. ఇందులో భాగంగా మహేష్‌ సతీమణి నమ్రత,  సోదరి అయిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ సతీమణి పద్మావతిని గురువారం బుర్రిపాలెం పంపిస్తున్నాడు. ఇక వీరితో పాటూ మహేష్బాబు కుమారుడు బుల్లి సూపర్ స్టార్ గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితార కూడా బుర్రిపాలెం వెళతారని తెలుస్తోంది.

English summary

Super Star Mahesh Babu Was previously adopted Burripalem Village in Guntur District.Now Mahesh Babu to Start Development activities in that adopted village from tomorrow. Mahesh Babu family members were started Preparations for that event in Guntur.