మహేష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

Mahesh Babu To Enter Into Politics

10:33 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu To Enter Into Politics

అవునా, అంటే అభిమానుల నుంచే ఈరకమైన ప్రపోజల్స్ , కామెంట్లు వస్తున్నాయి. బుర్రిపాలెం టూర్ తో మరీ ఎక్కువగా ఈరకమైన వాదనలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్, లేదు..కాదు..రానంటున్నా ఫ్యాన్స్ మాత్రం ఆయన మాటలు ఒప్పుకోవడం లేదు. తమ అభిమాన నటుడి పొలిటికల్ ఎంట్రీ ఖాయమే అంటున్నారు. పైగా బుర్రిపాలెం విజిట్ చేసిన మహేష్ బాబుకు ప్రజలు పట్టిన బ్రహ్మరథమే దీనికి తార్కాణమని చెబుతున్నారు. అప్పట్లో చిరంజీవికి ఎంతటి ప్రజా స్పందన వచ్చిందో తమ హీరోకి అంతకుమించిన రెస్పాన్స్ కనిపిస్తోందని సంబరపడిపోతున్నారు. కుప్పంలో జరిగిన 'ఇంద్ర' సినిమా షూటింగ్ సందర్భంగా వచ్చిన ఫ్యాన్స్ తో ఇప్పడు మహేష్ బుర్రిపాలెం పర్యటనను కూడా పోల్చేస్తున్నారు. కొత్త పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ రేంజ్ లో సిఎం కావాలని ఎక్కువమంది ఫ్యాన్స్ తమ మనసులోని మాటను సోషల్ మీడియాలో బయటపెట్టేసారు. అయితే.. తమ ఫ్యాన్స్ కోరుకున్నట్టు మహేష్ మనసు మార్చుకుని పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడో లేదో..వస్తే సక్సెస్ అవుతాడో లేదో మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇవి కూడా చదవండి: రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

ఇవి కూడా చదవండి: కేన్స్‌ చిత్రోత్సవాల్లో ‘బాహుబలి’

ఇవి కూడా చదవండి: మహేష్ దత్తత వెనుక అసలు కారణం వేరే ఉందా!?

English summary

Recently Super Star Mahesh Babu Visited Burripalem Village in Guntur District and according to a news that Mahesh Babu was planning to enter into Politics. Thats the reason behind he was going into people.