ప్రిన్స్ చెప్పులు తొడిగింది ఎవరికంటే ...

Mahesh Babu Touches Sathyaraj Foot In Brahmotsavam

10:20 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu Touches Sathyaraj Foot In Brahmotsavam

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. తెల్లారితే షో పడిపోతుంది. ఇక ఈ చిత్ర ప్రచారంలో భాగంగా మహేష్‌బాబు చెప్పులు తొడుగుతున్నట్టుగా ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే మహేష్‌ చెప్పులు తొడిగే వ్యక్తి ముఖాన్ని మాత్రం చూపించలేదు. దీంతో మహేష్‌ చెప్పులు తొడిగింది ఎవరికా? అంటూ ప్రశ్న మొదలై, అందరిలోనూ ఉత్కంఠను రేపింది. అయితే ఆ పోస్టర్‌ కూడా ఆకట్టుకుంది . తాజాగా మహేష్‌ ఎవరి కాళ్లకు చెప్పులు తొడిగింది అనే ప్రశ్నకు జవాబు దొరికేసింది.

బ్రహ్మోత్సవంలో మహేష్‌ తండ్రిగా సత్యరాజ్‌ నటిస్తున్నారు. తండ్రికి చెప్పులు తొడిగి ఆశీర్వాదం తీసుకునే సన్నివేశమట అది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మన సూపర్‌స్టారే మహేష్ చెప్పేసాడు. మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తుండడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి:పవన్ గురించి బన్నీ అలా ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చేసాడు(వీడియో)

ఇవి కూడా చదవండి:అవకాశాలు లేక వేశ్యగా మారిపోయిన ఆండ్రియా

English summary

Tollywood Super Star Mahesh Babu's recent film was "Brahmotsavam" and this movie was going release on May 20th and recently in an interview he said the secret that whom feet he had touched. Mahesh said that that scene comes when he takes blessings from satya raj who did mahesh babu father role in the movie.