బుర్రిపాలెంలో సూపర్ స్టార్ సందడి

Mahesh Babu Visits Burripalem Village

09:54 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Mahesh Babu Visits Burripalem Village

సూపర్ స్టార్ మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామాన్ని ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఎంపీ గల్లా జయదేవ్‌తో బాటు వచ్చిన మహేష్ బాబుకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వేల సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు తరలి రావటంతో గ్రామంలోని వీధులు జనంతో కిక్కిరిశాయి. ఊ­రంతా బ్రహ్మోత్సవ వాతావరణం నెలకొంది. గ్రామంలో జయదేవ్‌, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలసి ఓపెన్‌టాప్‌ జీపులో మహేష్ బాబు పర్యటించారు. మహేష్‌బాబు బాబాయి, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రూ. 2.16 కోట్లతో గ్రామంలో చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. మహేష్‌బాబు నాయనమ్మ నాగరత్నమ్మ దానం చేసిన స్థలంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. సమగ్ర శిశు అభివృద్ది పథకం కింద కొంతమంది చిన్నారులకు వారి చదువుకు అవసరమైన సాయానికి సంబంధించి అధికారిక పత్రాలు అందజేశారు. పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు ప్రదానం చేశారు. తన పేరిట హెల్త్ కార్డులను కూడా ఆయన స్థానికులకు అందజేశారు. మహిళా సంఘాలకు కోటి రూపాయల చెక్‌ను ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: బాలయ్యకు సంబధంలేని ‘శాతకర్ణి’ పై సాంగ్ రిలీజ్

‘నేను పుట్టిన గ్రామానికి సేవచేసే భాగ్యం కలగటం నా అదృష్టం. గొప్ప అవకాశం కూడా. నా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక నమూనా గ్రామంగా తీర్చిదిద్దుతా.. నా మొదటి లక్ష్యం అందరికీ విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటమే. అభివృద్ది అంటే రంగువేసి కడిగేసినంత తేలిక కాదు. ఆచరణలో చేసి చూపటమే నా ముందున్న కర్తవ్యం’ అని మహేష్‌బాబు అన్నారు. అంతకుముందు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీమంతుడు సినిమా ఒక స్పూర్తి అయితే, జయదేవ్‌ ప్రోత్సాహంతో ఈ గ్రామాలను దత్తతు తీసుకున్నానని మహేష్‌బాబు చెప్పారు. బుర్రిపాలెం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక పై గ్రామాన్ని వదిలిపెట్టకుండా తరచూ వస్తూనే ఉంటానన్నారు. అభివృద్ది చేసి తీరతానన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, ప్రభుత్వ సహకారంతో నెంబర్‌ వన్‌ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో దత్తతు తీసుకున్న గ్రామాన్నీ త్వరలో సందర్శిస్తానని, ఇప్పటికే అక్కడికి నమ్రత వెళ్లి వచ్చారని, వచ్చే వారంలో అక్కడికి వెళ్లి వారి ఇబ్బందులు తీర్చుతానన్నారు. దత్తత గామాల్లో తొలి ప్రాధాన్యం కింద విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఉంటుందని, బుర్రిపాలెం గ్రామస్తులకు వైద్య సేవలు అందించేందుకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌ యాజమాన్యం ముందుకు రావటం అభినందనీయమన్నారు.

ఒక్కసారి వచ్చి వెళ్లిపోతే అభివృద్ది జరుగుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా రెండు గ్రామాలకు తరచూ వస్తూనే ఉంటానని, అభివృద్ది అంటే రంగేసి కడిగేయటం కాదని తన అభిప్రాయం అన్నారు. భవిష్యత్‌లో తాను చేసే అభివృద్దిని అందరూ చూస్తారని బదులిచ్చారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న సిద్ధవరం గ్రామానికి వచ్చేవారం వెళ్తానని మహేష్ బాబు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:హత్తుకునే డైలాగులతో 'బ్రహ్మోత్సవం' ట్రైలర్‌

ఇవి కూడా చదవండి:నాలాంటోడే నాకొకడు తగిలాడన్న కాజల్

English summary

Super Star Mahesh Babu previously adopt a village named Burripalem in Andhra Pradesh and yesterday he visited Burripalem village and he said that he will surely develop Burripalem village and make that village as ideal Village.He also said that he will visit Siddavaram Village in Telangana State Next Week.