మహేష్‌తో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌!!

Mahesh Babu want to romance with Bollywood heroine

05:36 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Mahesh Babu want to romance with Bollywood heroine

సూపర్‌స్టార్‌ మహేష్‌ ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌ సినిమా మొదలవ్వబోతుంది. ఈ సినిమాకి హీరోయిన్‌ గా ఎవరిని ఎంపిక చెయ్యాలో అని మహేష్‌, మురగదాస్‌ తెగా ఆలోచిస్తున్నారట. ఇప్పటి వరకూ తెలుగులో నటించిన హీరోయిన్‌ కాకుండా వేరే కొత్త హీరోయిన్‌ తో నటిస్తే బావుంటుందని మహేష్‌ మొదట్లో అనుకున్నాడు. కానీ ఇప్పుడు మహేష్‌ నిర్ణయం మారింది. తనకి బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే అంటే ఇష్టమని మహేష్‌ ఒక సందర్భంలో చెప్పాడు. అది విని దీపిక చాలా సంతోషపడింది. మహేష్‌ నేనంటే ఇష్టమని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని ట్విట్టర్‌ లో కూడా పెట్టింది.

ఇదంతా చూసి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మహేష్‌, మురగదాస్‌లు కాంబినేషన్‌ లో వచ్చే సినిమాకి దీపిక హీరోయిన్‌ గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం దీపికా పదుకొనే ని సంప్రదించారట. ఈ విషయం పై దీపిక కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్‌ కోసం చర్చలు జరుపుతున్న సినిమా యూనిట్‌ త్వరలోనే హీరోయిన్‌ ను ఫిక్స్‌ చేస్తారట.

English summary

Mahesh Babu want to romance with Bollywood heroine Deepika Padukone in Murugadoss movie. But heroine was not at finalised.