మురుగదాస్ చిత్రం కోసం గడ్డంతో మహేష్(ఫోటో)

Mahesh Babu with beard

04:39 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Mahesh Babu with beard

బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే ఇప్పటి వరకు మనం మహేష్ ని గడ్డంలో చూడలేదు, అలా కనిపించడానికి మహేష్ కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలా అభిమానులు కూడా ఎప్పుడూ ఊహించుకోలేదు. అయితే మురుగదాస్ తో చేయబోతున్న సినిమాలో మహేష్ గతంలో మునుపెన్నడూలేని విధంగా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని సమాచారం. బ్రహ్మోత్సవం పరాజయం తర్వాత మహేష్ మీడియా ముందుకు రాలేదు. ఇందుకు గల కారణాలేంటని ఆరాతీయగా.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వర్కౌట్ ప్రారంభించాడని తెలిసింది.

ఓవైపు యూనిట్ మొత్తం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే.. మరోవైపు మహేష్ తన కొత్త లుక్ విషయంలో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో మహేష్ గడ్డంతో కనిపించనున్నాడు. స్ర్కిప్ట్ డిమాండ్ చెయ్యడంతో గడ్డం పెంచుకోవాలని మురుగదాస్ చెప్పడంతో మహేష్ తన లుక్ ని మార్చుకునే పనిలో నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. మరి.. ఈ సినిమా కోసం మహేష్ నిజంగానే గడ్డం పెంచుకుంటున్నాడా ? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. సినిమా విషయానికొస్తే.. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా కధానాయికగా నటిస్తోంది.

హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

English summary

Mahesh Babu with beard