పవన్ చేసిన తప్పుని నేను చెయ్యనన్న మహేష్

Mahesh Babu won't do Pawan Kalyan mistake

05:30 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Mahesh Babu won't do Pawan Kalyan mistake

తెరవెనుక పవన్ మహేష్ మంచి స్నేహితులు. ఇద్దరూ మనసు విప్పి బాగా మాట్లాడుకుంటారు. సినిమాలే కాకుండా చాలా అంశాలు చర్చకొస్తుంటాయి. ఇక సినిమాల విషయానికొస్తే పవన్, మహేష్ ఇద్దరూ డిఫరెంట్ జానర్స్ లో వెళ్తుంటారు. పవన్ సినిమాలు ఓ రకంగా ఉంటే… మహేష్ సినిమాలు మరో రకంగా ఉంటాయి. అయితే ఒకర్ని చూసి మరొకరు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. తాజాగా పవన్ ను చూసి మహేష్ ఓ కొత్త విషయం నేర్చుకున్నాడు. పవన్ చేసిన ఆ తప్పును తను రిపీట్ చేయనంటున్నాడు. ఇంతకీ పవర్ స్టార్ చేసిన తప్పేంటి? అదేంటంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను ఆఘమేఘాల మీద పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్‌

మరోసారి ఎడిట్ రూమ్ లో కూర్చొని సమీక్షించుకునే సమయం కూడా లేకపోయింది. ఫైనల్ కట్ ను దర్శకుడికి అప్పగించి, తను సాంగ్స్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో పాటు ప్రమోషన్ కల్పించడానికి కూడా టైం లేకుండా పోయింది. ఇలా సరైన ప్లానింగ్ లేకుండా విడుదల చేయడం కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కలిసిరాలేదు. ఇది చూసి మహేష్ చాలానే నేర్చుకున్నాడు. తన బ్రహ్మోత్సవం సినిమాకు ఆ మిస్టేక్ చేయనుంటున్నాడు. మే 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అంటే దాదాపు నెల రోజులు టైం ఉంది. కాబట్టి… అన్ని పనులు వీలైనంత త్వరగా ముగించుకొని, పక్కా ప్లానింగ్ తో 15 రోజుల ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని మహేష్ భావిస్తున్నాడట.

English summary

Mahesh Babu won't do Pawan Kalyan mistake. Prince Mahesh Babu won't do Pawan Kalyan mistake that he was did in Sardar Gabbar Singh movie.