బాహుబలిని కొట్టిన శ్రీమంతుడు

Mahesh Babu’s Srimanthudu Broke Baahubali’s Record

06:14 PM ON 21st November, 2015 By Mirchi Vilas

 Mahesh Babu’s Srimanthudu Broke Baahubali’s Record

ప్రభాస్‌ నంటించిన బాహుబలికి, మహేష్‌ నటించిన శ్రీమంతుడికి బడ్జెట్‌ విషయంలో అసలు సంబంధంలేదు. కానీ బాహుబలికి శ్రీమంతుడు గట్టి పోటీయే ఇచ్చాడు. బాక్సాఫీసు వద్ద 150కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుని 2015లో బాహుబలి తరువాతి స్థానంలో శ్రీమంతుడు చిత్రం నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన శ్రీమంతుడు ఎక్కువ వసూళ్ళను రాబట్టి నిర్మాతల పాలిట కల్పవృక్షం అయింది. బాహుబలి శ్రీమంతుడు స్థాయిలు వేరైనా చాలా విషయాల్లో శ్రీమంతుడు బాహుబలిని అధిగమించాడు.

బాక్సాఫీస్‌ వద్దే కాకుండా టెలివిజన్‌ టిఆర్‌పీ రేటింగ్‌ల్లోనూ శ్రీమంతుడు శ్రీమంతుడు బాహుబలికి మంచి పోటీనిచ్చాడు. బాహుబలిని మాటీవీ సొంతం చేసుకోగా, శ్రీమంతుడిని జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇందులో బాహుబలి మొదట ప్రదర్శించబడగా రికార్డు స్థాయిలో టిఆర్‌పి రేటింగ్‌ వచ్చింది. ఈ రేటింగ్‌ని ఎవరూ అధిగమించలేరనుకున్నారు. అయితే శ్రీమంతుడు ప్రదర్శితం అయ్యాక ముఖ్యంగా అర్బన్‌ ఏరియాల్లో శ్రీమంతుడు బాహుబలిని అధిగమించాడు. అర్బన్‌లో బాహుబలికి 22.53రేటింగ్‌ రాగా శ్రీమంతుడికి 24.8 రేటింగ్‌ వచ్చింది. దీనితో అర్బన్‌ ఏరియాలో మహేష్‌ సత్తా ఏమిటో అర్ధమవుతుంది. మొత్తంగా చూస్తే బాహుబలికి 21.34 రేటింగ్‌ రాగా ఆ తరువాత స్థానంలో శ్రీమంతుడు వచ్చాడు.

English summary

India’s biggest motion picture Baahubali’s satellite rights were sold to MAA TV for many crores while another biggest hit of the year in Telugu, Srimanthudu’s satellite rights went to ZEE Telugu. Baahubali was premiered on MAA Tv achieving the highest TRP Ratings ever and Srimanthudu which was premiered on Zee Telugu on November 8th, stood second with high TRP’s.