స్టార్ హీరోని ఫోన్లో విష్‌ చేసిన మహేష్‌!!

Mahesh congratulates Star Hero in phone

01:35 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Mahesh congratulates Star Hero in phone

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు డిసెంబర్‌ 27న అంగరంగ వైభవంగా విడుదలయ్యాయి. ఈ పాటలు తో పాటు ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ని ఎప్పుడూ చూడని విధంగా అల్ట్రాస్టైలిష్‌గా ఉన్నాడు. ట్రైలర్ కూడా చాలా ఇంటరెస్టింగ్‌ గా ఉంది. ఈ ట్రైలర్‌ని యూట్యూబ్‌లో పెట్టిన వెంటనే ఒక్క రోజులోనే 10 లక్షలు వ్యూలు వచ్చి రికార్డ్ సృష్టించింది. ఈ ట్రైలర్ చూసి ఎంతో మంది స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

అందులో సూపర్‌స్టార్‌ మహేష్‌ కూడా ఉన్నారు. ట్రైలర్‌ నచ్చడంతో పాటు ఎన్టీఆర్‌ లుక్ కూడా కొత్తగా ఉండడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్‌ ఎన్టీఆర్‌ కి ఫోన్‌ చేసి ట్రైలర్‌ చాలా బాగుంది, ఆల్‌దిబెస్ట్‌ ఎన్టీఆర్‌ అని విష్‌ చేశారట. హీరోలు అందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరి ఆడియో ఫంక్షన్లకి ఇంకొకరు వస్తూ ఉంటారు. ఫ్రెండ్లీగా కలిసి ఉంటారు. కానీ ఈ హీరోల అభిమానులు మాత్రం మా హీరో గొప్పోడంటే మా హీరో గొప్పోడని కొట్టుకుని చస్తూ ఉంటారు. ఇప్పటికైనా మారండి బాస్‌.

English summary

Mahesh congratulates Jr. Ntr in phone after watching Nannaku Prematho trailer.