బ్రహ్మొత్సవం లో మహేష్ బాబు కూతురు ?

Mahesh Daughter To Act In Brahmotsavam

07:07 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Mahesh Daughter To Act In Brahmotsavam

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత మహేష్ బాబు- శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో రాబోతున్న రెండో చిత్రం బ్రహ్మొత్సవం. ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మొత్సవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సమంత , కాజల్ అగర్వాల్ , ప్రణీత , సత్య రాజ్ , రేవతి వంటి అగ్ర నటినటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.బ్రహ్మొత్సవం చిత్రంలో చిన్న పిల్ల పాత్ర కోసం మహేష్ బాబు కూతురైన చిన్నారి సితారను నటింపజెయ్యాలనే ఆలోచనలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల వున్నట్టు సమాచారం.

ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్- మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 1-నేనోక్కడినే చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్రలో మహేష్ తనయుడు గౌతం నటించి అలరించిన విషయం తెలిసిందే . చిన్నారి సితారను నటింపజెయ్యాలనే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

English summary

Mahesh Babu is filming for his upcoming film Brahmotsavam directed by Srikanth Addala . Director of the film Srikanth Addala has plans to rope in Sitara, Mahesh Babu's daughter, to play the character.We all know pastly Mahesh Babu's son Gautham made his acting debut in the film 1: Nenokkadine. Gautham played the child role of Mahesh Babu in the film and Appreciated by the critics.