'బాపు బొమ్మకి' మహేష్‌ 'లిప్‌లాక్‌'!

Mahesh giving liplock to Bapu Bomma in Brahmotsavam

03:22 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Mahesh giving liplock to Bapu Bomma in Brahmotsavam

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి బ్లాక్‌ బస్టర్‌ అందించిన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఏకంగా ముగ్గురు కథానాయికలు. సమంత, కాజల్‌అగర్వాల్‌, ప్రణీత సుభాష్. తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఊటీలో శరవేగంగా జరుపుకుంటుంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రంలో మహేష్‌ బాబుతో సమంత లిప్‌కిస్‌ చేయబోతుంది అనే వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఆ తరువాత కాజల్‌తో లిప్‌కిస్‌ చేస్తున్నాడని వార్తలొచ్చాయి అయితే అది కూడా కన్ఫర్మ్‌ కాదట.

ఇంతక ముందు దూకుడులో సమంతాకు, బిజినెస్‌మెన్‌ లో కాజల్‌కు లిస్‌కిస్‌లు ఇచ్చిన మహేష్‌బాబు ఈ సారి బాపు బొమ్మ ప్రణీత సుభాష్‌కు ఇవ్వబోతున్నాడు. ప్రణీత కూడా ఇప్పటి వరకు చాలా లిప్‌లాక్స్‌ లో నటించినా అవన్నీ చిన్న హీరోలతోనే చేసింది కాబట్టి పెద్దగా పాపులర్‌ అవ్వలేదు. ఇప్పడు మహేష్‌ లాంటి స్టార్‌తో లిప్‌లాక్‌ సన్నివేశాలలో కనిపించనుంది కాబట్టి ప్రణీత కూడా క్లిక్‌ అయ్యి స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుతుందేమో చూడాలి.

English summary

Mahesh giving liplock to Bapu Bomma in Brahmotsavam movie. Srikanth Addala is directing this movie.