కృష్ణ పై మహేష్‌బాబు షాకింగ్ కామెంట్స్

Mahesh Launched Sri Sri Audio

10:25 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Mahesh Launched Sri Sri Audio

'సాధారణంగా ఎప్పుడూ నా సినిమా కార్యక్రమాలకు నాన్న అతిథిగా వస్తుంటారు. ఈ రోజు నాన్న వేడుకకు నేను అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉంది నాలుగైదు నెలల క్రితం ‘శ్రీశ్రీ’ చిత్రంలో నాన్న గెటప్‌ చూసి ఆశ్చర్యపోయాను. నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. అసలు నాన్నకు నేను పెద్ద అభిమానిని. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. చిత్రబృందానికి శుభాకాంక్షలు' అని సూపర్ స్టార్ మహేష్‌బాబు అన్నాడు. కృష్ణ, విజయనిర్మల జంటగా నటిస్తున్న ‘శ్రీశ్రీ’ చిత్రం పాటల వేడుకకు మహేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడీని ఆవిష్కరించగా, తొలి సిడిని రెబెల్ స్టార్ కృష్ణంరాజు స్వీకరించారు. ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా, సాయిదీప్‌ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్‌ సిరాజ్‌ నిర్మాతలు. కృష్ణ సినీ ప్రస్థానం స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ వేదికపై చిత్ర బృందానికి, అతిథులకు జ్ఞాపికలు అందజేశారు.

కృష్ణ మాట్లాడుతూ ‘‘నా సినీ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్మానించినందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇద్దరిని నేను గుర్తు చేసుకోవాలి. ఒకరు ‘తేనె మనసులు’తో నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావుగారు. మరొకరు నాతో ‘గూఢచారి 116’ చేసిన డూండీ. ఆ చిత్రంతో నన్ను తిరుగులేని మాస్‌ హీరోగా నిలబెట్టారాయన. నేను 50 ఏళ్లుగా వెనక్కి తిరిగిచూసుకోకుండా ప్రయాణం చేయడానికి కావల్సిన ధైర్యం ఇచ్చారు అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఇక శ్రీ శ్రీ చిత్రానికి సంబంధించి కృష్ణ మాట్లాడుతూ, శివ నాకు చెప్పిన మరాఠా కథ కంటే వందరెట్లు గొప్పగా ఉంటుందీ చిత్రం. నా కెరీర్‌లో ఇదో మైలురాయి’’ అని చెప్పాడు.

కృషంరాజు మాట్లాడుతూ ‘‘ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో ఉత్తముడు కృష్ణ. నేను కాదు రెబల్‌స్టార్‌... ఆయనే రెబల్‌ ప్రొడ్యూసర్‌. ‘అల్లూరి సీతారామరాజు’తో తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించారు. కౌబాయ్‌ సినిమాలు... కలర్‌ సినిమా... ఇలా ఎన్నో చేశారు. కృష్ణతో నాకున్న అనుబంధం చాలా గొప్పది. మా ఇద్దరి మనసూ ఒకటే. 50 ఏళ్లుగా నటిస్తున్నా కృష్ణలో ఉత్సాహం ఎక్కడా తగ్గలేదు. ఆయన ఇంకా ఎన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. ‘‘చాలా సంవత్సరాల తర్వాత నేనూ కృష్ణగారూ కలిసి నటించాం. ఇది మా జంటకు 48వ చిత్రం. ‘శ్రీశ్రీ’ అందరికీ నచ్చే సినిమా అవుతంది' అని విజయ నిర్మల పేర్కొంది.

కాగా ఈ సినిమాలో సుధీర్‌బాబు కొడుకు దర్శన్‌ తెరకు పరిచయం అవుతున్నాడు. ఇదే విషయాన్ని సుదీర్ చెబుతూ ఇది తనకెంతో ఆనందంగా ఉందన్నాడు. ఇక ఎన్ని సినిమాల్లో నటించినా రాని సంతృప్తి ఈ చిత్రంలో కాసేపు కనిపిస్తే వచ్చిందన్నాడు. కృష్ణ సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఆయనకు సన్మానపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ముప్పలనేని శివ. సంగీత దర్శకుడు ఇ.ఎస్‌.మూర్తి నరేష్‌, కోదండరామిరెడ్డి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, శివాజీరాజా, గౌతమ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

English summary

Yesterday Super Star Krishna's latest Movie "Sri Sri" audio launch was grandly launched.This movie Audio was launched by Super Star Mahesh Babu.Mahesh Babu says that he was bis fan of his dad and he was very happy to release his fathers movie audio