'చట్టంతో పోరాటం' చేస్తున్న మహేష్‌!!

Mahesh-Murugadoss movie title as Chattamtho Poratam

04:59 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Mahesh-Murugadoss movie title as Chattamtho Poratam

ప్రిన్స్ మహేష్‌ బాబు-మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కబోతుందన్న విషయం తెలిసినదే. ఈ చిత్రాన్ని 2016, ఏప్రిల్‌ 12న సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫ్రీ-ప్రోడక్షన్‌ పనులు ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ చిత్రంలో మహేష్‌ న్యాయవ్యవస్ధని ప్రశ్నించే పాత్రలో కనిపించబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'చట్టంతో పోరాటం' టైటల్ ను పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఇదే టైటిల్‌తో చిరంజీవి నటించిన చిత్రానికి కూడా ఉంది.

చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం చిత్రం 1985లో విడుదలై చిరంజీవి కెరీర్‌లోనే ఒక మైలురాయిరా నిలిచిపోయింది. ఇప్పడు ఇదే టైటిల్‌ను మహేష్‌ -మురుగదాస్‌ చిత్రానికి పెట్టాలని చూస్తున్నారట. పైగా మహేష్‌ నటించబోయే ఈ కథకి ''చట్టంతో పోరాటం'' అనే టైటిల్ కరెక్ట్‌ యాప్ట్ అని అనుకుంటున్నారు, మరో పక్క ఈ టైటిల్‌ కొంచెం పాతగా ఉందని కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్‌ బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరో పక్క మురుగదాస్‌ సోనాక్షి సిన్హాతో తెరకెక్కిస్తున్న 'అఖిరా' చిత్రంలో బిజీగా ఉన్నారు.

English summary

Mahesh-Murugadoss movie title as Chattamtho Poratam. This is correct apt for this story.