బావ నిర్మాణంలో బావమరిది

Mahesh producing Sudheer Babu movie

11:06 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Mahesh producing Sudheer Babu movie

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు మొదటిసారి కో-ప్రొడ్యూస్‌ చేసిన సినిమా 'శ్రీమంతుడు'. జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైలిమిటెడ్‌ పతాకం పై నిర్మించిన శ్రీమంతుడు మహేష్‌ కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మహేష్‌ దీనినే కొనసాగించాలనుకుంటున్నారు. తన బ్యానర్‌ లో మరిన్ని చిత్రాలు నిర్మించాలనేది మహేష్‌ ప్లాన్‌. ఈ నేపధ్యంలో మహేష్‌ తన బావమరిది సుధీర్‌బాబుతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అనుకుంటున్నాడు. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించబోతున్నారట. దూకుడు, ఆగడు చిత్రాలతో మహేష్‌-శ్రీనువైట్ల మధ్య మంచి స్నేహం కుదిరిందన్న విఫయం తెలిసిందే. అయితే ఆగడు అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో మహేష్‌-శ్రీనువైట్ల కాంబినేషన్‌ ఇంక రిపీట్‌ కాదేమో అనుకున్నారంతా.

కానీ మహేష్‌ మరోసారి శ్రీనువైట్ల కి అవకాశమిచ్చాడు. కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మహేష్‌, సుధీర్‌ వాళ్లు నటించే చిత్రాలతో బిజీగా ఉన్నారు.

English summary

Super Star Mahesh Babu producing his brother-in law Sudheer Babu movie. This movie is going to direct by Srinu Vaitla.