మహేశ్, సమంత 'క్షణం' కోసం వచ్చారు

Mahesh Samantha At Kshanam Trailer Launch Event

09:49 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Mahesh Samantha At Kshanam Trailer Launch Event

పి.వి.పి, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌లో రొమాంటిక్ సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘క్షణం’ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్, సమంత రిలీజ్ చేశారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అడవి శేష్ కథను అందించ డంతో పాటూ హీరోగా నటిస్తున్నాడు. శేష్ సరసన ఆదాశర్మ నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో నటిస్తోంది. సత్యదేవ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సస్పెన్స్ డ్రామా ఈ చిత్ర ట్రైలర్ ని మహేష్ బాబు, సమంత వీక్షించి, యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ సినిమాకి ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు,అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె. ఇక మహేష్, సమంత ట్రైలర్ విడుదల చేసిన ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary

"Kshanam" movie which was made by PVP cinemas.This movie trailer was launched by the movie unit yesterday.Super Star Mahesh Babu and Samantha attended as chief guests to this event.Adavi shesh,Adah Sharma and Anasuya was acted in lead roles in the movie.This movie was going to be releasedon 4th March