స్కర్టులు వద్దంటూ, విదేశీ పర్యాటకులకు కేంద్రమంత్రి సలహా

Mahesh Sharma told that don't wear skirts

03:27 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Mahesh Sharma told that don't wear skirts

దేశంలో రోజురోజుకీ మహిళలపై అరాచకాలు పెరిగిపోవడమే కాదు. విదేశీ టూరిస్టులపై కూడా ఘాతుకాలకు పాల్పడుతున్న వైనం వెలుగు చూస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మహేష్ శర్మ ఓ సలహా ఇచ్చారు. భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు దయచేసి స్కర్టులు ధరించకండి అని ఆయన సూచించారు. దేశంలో పర్యటించేందుకు వచ్చిన విదేశీ పర్యాటకులు ఏం చేయాలి? ఏం చేయకూడదనే అంశాలను ఓ కార్డుపై రాసి విమానాశ్రయాల్లో వారికి అందజేస్తున్నామని కూడా కేంద్రమంత్రి చెప్పారు. స్కర్టులు ధరించవద్దని కేంద్రమంత్రి ఇచ్చిన సలహాపై ట్విట్టర్ ద్వారా నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. సాంస్కృతిక దేశమైన మన భారత్ లో దేవాలయాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ఆగ్రాలోని అద్భుతమైన తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన విదేశీ పర్యాటకుల భద్రత కోసం స్కర్టులు ధరించి తిరగవద్దని కేంద్రమంత్రి సూచించారు. తన వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. విదేశీ పర్యాటకులు ఏం ధరించాలి ఏం ధరించకూడదు అని తాము చెప్పడం లేదని రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే తాము కోరుతున్నామని ఆయన సూచించారు. ఎవరైనా దుస్తులు వారి ఆలోచనా విధానాన్ని బట్టి ధరించవచ్చని, దానిని మార్చుకోవాలనే హక్కు తనకు లేదన్నారు. ఇలాంటి సలహాలతో దేశాన్ని కించపర్చవద్దని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు.

అయితే కొందరు నెటిజన్లు కేంద్రమంత్రికి మద్ధతుగా నిలిచారు. దేవాలయాలు, ఇతర పవిత్ర స్థలాల్లో విదేశీయులు స్కర్టులు ధరించరాదని కేంద్రమంత్రి చేసిన సూచనతో తాము ఏకీభవిస్తున్నట్లు పలువురు ట్వీట్ చేశారు. మన దేశ మహిళలు ఇస్లామిక్ దేశాలకు వెళ్లినపుడు బుర్ఖా, స్కార్ఫ్ ధరించాలని కూడా సలహా ఇవ్వాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మొత్తానికి అన్నింటి మాదిరిగానే ఈ అంశం కూడా చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

ఇది కూడా చదవండి: నాగ్ 'హాథీరామ్ బాబా' ఫస్ట్ లుక్

ఇది కూడా చదవండి: లంచం ఇచ్చేందుకు బిచ్చగాడుగా మారిన కుర్రాడు

English summary

Mahesh Sharma told that don't wear skirts