బావ బ్యానర్లో బావమరిది

Maheshbabu To Make Movie With Sudhir Babu

03:10 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Maheshbabu To Make Movie With Sudhir Babu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇటీవల సొంతంగా మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ ను స్థాపించాడు. మొదటిసారిగా శ్రీమంతుడు సినిమాకి సహ నిర్మాతగా వ్వవహరించాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మహేష్‌ రాబోయే చిత్రం బ్రహ్మూెత్సవం సినిమాకి కూడా మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకూ ఏ సినిమానూ సింగిల్‌ గా నిర్మించని మహేష్‌ ఇప్పుడు తన సొంత బ్యానర్‌లో సినిమా తీయడానికి సిద్దమవుతున్నాడు. మహేష్‌ బావ సుధీర్‌బాబు హీరోగా నటించే ఒక సినిమాని మహేష్‌ నిర్మిస్తున్నాడట. ఈ విషయాన్ని ఒక టీ.విలో షోలో సుదీర్‌ తెలియజేసాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో టైగర్‌ షరాఫ్ హీరోగా నటిస్తున్న బాఘి సినిమాతో బిజీగా ఉన్నాడట సుధీర్‌. ఆ సినిమా పూర్తయిన తరువాత తెలుగులో సుధీర్‌ చేయబోయే సినిమాని మహేష్‌ నిర్మిస్తున్నాడు. మహేష్‌ ఎలాఅయినా తన బావని స్టార్‌ హీరో చెయ్యాలని తాపత్రయపడుతున్నాదాని సమాచారం .

English summary

Super Star Prince Mahesh Babu To Make a film with his brother in law Sudhir babu .This was said by Sudheer babu in a telivision show.Presntly sudhir babu was acting in one of the bollywood film as a Villain