రంగనాథ్‌ మృతికి అసలు కారణాలు ఇవే!!

Main Reasons for death of Ranganath

02:21 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Main Reasons for death of Ranganath

టాలీవుడ్‌ సినీ పరిశ్రమ మరో సీనియర్‌ నటుడ్ని పోగొట్టుకుంది. తెలుగు సినీ ప్రియుల్ని తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న రంగనాథ్‌ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్‌ పూర్తిచేసిన రంగనాధ్‌ ఆ తరువాత ఇండియన్‌ రైల్వేస్‌ లో టికెట్‌ కలెక్టర్‌గా కొంత కాలం పని చేశారు. ఆ తరువాత 1969 లో బుద్ధిమంతుడు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి 300 పై చిలుకు చిత్రాల్లో నటించిన రంగనాధ్‌ జమిందారి గారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందమె ఆనందం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. అయితే రంగనాధ్‌ చనిపోవడానికి అసలు కారణాలు ఇవే అని వినిసిస్తున్నాయి.

రంగనాధ్‌ భార్య బాత్‌రూంలో పడిపోయి వీల్‌చైర్‌కి పరిమితమైతే దాదాపు 15 సంవత్సరాలు కన్న బిడ్డలా తన భార్యను చూసుకున్నాడు రంగనాధ్‌. షూటింగ్‌ లో ఎంత బిజీగా ఉన్నా రోజు టైమ్‌కి ఇంటికి చేరుకునేవాడు. తన భార్యకి తనే స్నానం చేయించి అన్నం తినిపించి అన్ని పనులు తనే చేసేవారు. రంగనాధ్‌ భార్య భర్తల అనుబంధానికి నిర్వచనంగా నిలిచారు. ఈ విధంగా చేశారంటే రంగనాధ్‌కి భార్యంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొద్ది కాలం క్రితమే రంగనాధ్‌ భార్య మృతిచెందింది. రంగనాధ్‌ పిల్లలు తమ వద్దకు వచ్చేయమని అడిగినా రంగనాధ్‌ వాళ్ల మాట వినకుండా తన భార్య నివసించిన ఇంట్లోనే గడిపేవారు.

ఇంత మంచి నటుడికి తెలుగు సినీ పరిశ్రమలో సరైన అవకాశాలు రాకపోవడంతో ఒంటరిగా ఇంట్లోనే గడిపేవారు. తరచూ రంగనాధ్‌కి తన భార్య గుర్తు రావడం తన ఒంటరితనం తనని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించేవి. దాని వల్లే తను ఉరి వేసుకుని చనిపోయారని రంగనాధ్‌ సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు.


English summary

Main Reasons for death of Ranganath.