భారతీయులంటే అంత చులకనా?

Maine Governor Paul Lepage Comments On Indian Workers

11:26 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Maine Governor Paul Lepage Comments On Indian Workers

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ కోసం వివిధ పార్టీల తరపున పోటీ పడుతున్న అభ్యర్థులు భారత్‌ పై ఉన్న అక్కసును ఎన్నికల ప్రచారంలో వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే వివాదాస్పద ప్రకటనలతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పతాక శీర్షికల్లోకి ఎక్కిన విషయం తెల్సిందే. అలాగే, అమెరికాలోని ఓ చిన్న రాష్ట్రానికి చెందిన గవర్నర్ కూడా భారతీయులను చులకనగా మాట్లాడుతూ మీడియాకు దొరికిపోయారు. ముఖ్యంగా, ట్రంప్... భారతీయుల ఇంగ్లీషు మాండలికాన్ని అవహేళన చేసి 24 గంటలు గడవక ముందే అదే పార్టీకి చెందిన మైన్ ‌(అమెరికాలో చిన్న ఈశాన్య రాష్ట్రం) గవర్నర్‌ పాల్‌ లిపేజ్‌ కూడా హేళనగా మాట్లాడారు. రాష్ట్ర రిపబ్లికన్‌ సదస్సులో శనివారం మాట్లాడుతూ 'భారతీయ ఉద్యోగులు చెత్తగాళ్లు.. అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారితో మాట్లాడాలంటే అనువాదకుడు ఉండాల్సిందే' అన్నారు. దీని పై తీవ్రస్థాయిలో నిరసనలు రావడంతో ఆయన తేరుకుని సారీ చెపుతూ.. భారత్ గొప్ప దేశమంటూ కొనియాడారు.

ఇవి కూడా చదవండి:

అడల్ట్‌ సినిమాల్లో నటించడానికి రెడీ

టాప్ లెస్ సెల్ఫీతో ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు సూపర్ ఆఫర్ కొట్టేసింది

స్కూల్ గ్రౌండ్‌ నుంచి విద్యార్ధిని ఎత్తుకెళ్లిన దెయ్యం(వీడియో)

English summary

American State Maine Governer Paul Lepage said that Indian workers in America were worst and their language was not understandable. Later he said sorry for his words by Saying That India is Great Country.