అందుకే విజయాలు సొంతం అంటున్న నాని

Majnu movie team came to Rajamahendravaram

11:18 AM ON 1st October, 2016 By Mirchi Vilas

Majnu movie team came to Rajamahendravaram

తన ప్రతి సినిమా ఒక డ్రీమ్ రోలేనని, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం వల్లే విజయాలు సొంతం చేసుకుంటున్నానని సినీ హీరో నాని చెప్పాడు. ఆయన నటించిన 'మజ్ను' సినిమా విజయయాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో శుక్రవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తన సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. దిల్ రాజు నిర్మిస్తున్న 'నేను లోకల్' అనే సినిమాలో నటిస్తున్నా అన్నాడు. రాజమౌళితో సినిమా లేదు. ఒకవేళ ఉంటే ఇలా ఉంటానా. పెద్ద మీటింగ్ పెట్టి సంతోషం పంచుకుంటా అని చెప్పాడు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ విజయాల హీరో నానితో తాను నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

చిత్ర దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ తన తొలిచిత్రం ఉయ్యాల జంపాల సమయంలో రాజమహేంద్రవరంతో అనుబంధం ఏర్పడిందన్నారు. మజ్నుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. అనంతరం చిత్ర యూనిట్ మజ్ను సినిమా ప్రదర్శింపబడుతున్న అనుశ్రీ, నాగదేవి థియేటర్లకు వెళ్లి సందడి చేసింది. రాజమహేంద్ర వరం 'ఆనంద్ రీజెన్సీ'కి విచ్చేసిన మజ్ను టీంని 'మిర్చివిలాస్' ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు పై మీరు ఒక లుక్ వెయ్యొచ్చు..

1/4 Pages

English summary

Majnu movie team came to Rajamahendravaram