మైనర్ అబ్బాయిని పెళ్ళాడిన 22ఏళ్ళ యువతి

Major beautician marriage with minor boy

04:19 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Major beautician marriage with minor boy

ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్లు కామన్‌ అయిపోయాయి. పెద్దలకు తెలీకుండా పెళ్ళి చేసుకోవడం తర్వాత వాళ్లు ఏమీ చేయలేక ఓకే చెప్పడం మామూలే. అయితే ఇలాగే గతంలో ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా ఒక జంట పెళ్ళి చేసుకుంది. అయితే ఆ వరుడు మైనర్‌ కావడంతో 8 నెలలు ఇరువురు దూరంగా ఉన్నారు. చివరికి ఈ ఎడబాటుకి బ్రేక్‌ పడింది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ చిలకలగూడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ వారాసి గూడకు చెందిన ఎమ్‌. మౌనిక (22) బ్యూటీషియన్‌ కోర్సు చేసి బ్యూటీపార్లర్‌ రన్‌ చేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన పి.ఆదర్శ్‌ (21) ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ఎవరికీ తెలీకుండా ఆగష్టు 16వ తేదీన యాదగిరికొండ పాత నర్సింహ స్వామి గుడిలో పెళ్ళి చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసే నమోదు చేసారు.

వరుడి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్ద‌రి స‌ర్టిఫికెట్లు చూసిన పోలీసులు వరుడు ఆదర్శ్ మైనర్ అని నిర్ధారించారు. మేజర్‌ అవడానికి ఇంకో మూడు నెలలు ఉందని పోలీసులు సూచించడంతో వధూవరులు ఇద్దరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు.

3 నెలలు గడిచిన తరువాత మౌనిక తన భర్త అయిన ఆదర్శ్‌ ని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దాంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదివారం నాడు ఠాణా ప్రాంగణంలో ఆదర్శ్‌ తో పాటు అతని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఆదర్శ్‌కి ఆమెతో ఉండడం ఇష్టమేనని తనతోనే ఉంటానని స్పష్టం చేసాడు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. దీంతో అక్కడ బస్తీ లోని పెద్దలు ఆదివారం సాయంత్రం అక్కడి గుడిలో ప్రేమ జంటకు మరో మారు పెళ్ళి చేసారు.

English summary

Here we discuss about Major beautician marriage with minor boy.