మేకప్‌ తెచ్చిన తంటా.!

Make Up Troubles A Girl In England

04:39 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Make Up Troubles A Girl In England

వివరాల్లోకి వెళ్తే 15 ఏళ్ళ జహీరా సిద్ధిక్‌ స్నేహితులతో కలిసి ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌ హమ్‌ సెంటర్‌కు వెళ్ళడానికి బస్సు ఎక్కింది . అక్కడ వరకు బాగానే ఉంది కానీ తన స్నేహితులతో బయటకు వెళ్ళెటప్పుడు ఆమె మేకప్‌ వేసుకుని చాలా అందంగా ముస్తాబై బస్సు ఎక్కింది అయితే ఈ లోపు వచ్చిన బస్సు కండక్టర్‌ ఆమెను తన టక్కెట్టు చూపించమని అడగగా కండక్టర్‌కు ఆమె మైనర్ కావడంతో తన కోసం తీసుకున్న పిల్లల టిక్కెట్టును చూపించింది. టిక్కెట్‌ చూసిన కండక్టర్‌ నీ వయస్సు ఎంత అని అడగగా ఆ యువతి తన 15 సంవత్సరాలని చెప్పింది. అయితే ఆమె వయసును కండక్టర్‌ నమ్మలేదు. దానితో ఆ కండక్టర్ ఆ బాలికను అందరూ చూస్తూండగానే బయటకు లాగేసి , ఆ బాలికకు 3000 జరిమానా కూడా విధించింది.

బాలిక మేకప్‌ ఎక్కవగా వేసుకోవడం వల్ల ఆమె 15 ఏళ్ళ వయసు కంటే ఎక్కువ వయసున్నఅమ్మాయి లాగా కండక్టర్ కు కనిపించిందట . దీనికి తోడు ఆ బాలిక దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డు కూడా లేక పోవడంతో కండక్టర్‌ అలా చేసిందట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తన బంధువుల సహాయంతో కండక్టర్‌ ప్రవర్తన అవమానకరంగా ఉందని , బస్సు ప్రయాణికురాలిని దోషిగా చూశారంటూ నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్ధకు ఫిర్యాదు చెయ్యగా దీని పై కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు ప్రారంభించారు.


English summary

A girl in Birmingham in England was thrown away from the bus by the conductor because of heavy make up