మూడేళ్లకే బామ్మగా మారిన 'రోయ్'!

Makeup Makes 3 Year Girl as a Old Woman

04:22 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Makeup Makes 3 Year Girl as a Old Woman

ఈ చిత్రం చూసారా... నుదిటిపై ముడతలతో కనుబొమ్మలు ఎగురేస్తున్న ఈమెను చూసిన వారెవరైనా అచ్చం 60 ఏళ్ళు దాటిన బామ్మ అనుకోవడం ఖాయం. ఎందుకంటే బామ్మ నవ్వులా అందంగా నవ్వినట్లుంది కూడా. .. కానీ ఈమె ముమ్మాటికీ బామ్మ కానేకాదు. బామ్మే అనుకుంటే పప్పులో కాలేసినట్లే .. నిజం ... ఈ ఫొటోలో ఉన్నది మూడేళ్ల చిన్నారి. మరి ఇదేమిటని అనుకుంటే, అదంతా మేకప్‌ మహిమే అని చెప్పాలి.

వివరాల్లోకి వెళితే , ఈ ఫోటోలో వుంది ఒహైయోకు చెందిన మూడేళ్ల చిన్నారి రోయ్‌. ఈ చిన్నారికి ఈ వయసునుంచే మేకప్‌ వేసుకోవడం అంటే భలే ఇష్టం. అందుకే తన ఆంటీని ఎప్పుడూ మేకప్‌ వేయమని సతాయిస్తుంది. అయితే ఎప్పుడూ వేసేలా కాకుండా ఆమె ఆంటీ సమంతా పార్సన్స్‌ ఈ సారి కాస్త వెరైటీగా ప్రయత్నించింది. ఇంకేముంది అచ్చం బామ్మలా కనిపించేలా చేసేసింది. మేకప్‌ పూర్తయ్యాక అద్దం ముందుకు తీసుకెళ్లింది. అయితే మొదట తనను తాను చూసుకున్న రోయ్‌ రూపం మారిపోయిందని ఒకటే ఏడుపు. సర్ది చెప్పడంతో ఆ తర్వాత కుదుటపడి.. ఫొటోలకు ఫోజులిచ్చి సందడి చేసేసింది. వీటిని రోయ్‌ ఆంటీ సమంతా ట్విట్టర్లో పెట్టిందో లేదో .. కొద్ది సేపట్లో ఈ పోస్టు హల్ చల్ చేసేసి, లైకులే, లైకులు ... షేర్ లే షేర్లు ....

English summary

A three year old baby become old woman. That baby make old by make up