చిరంజీవిని ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల్లో తిరగనివ్వం!

Mala Mahanadu leader shocking comments about Chiranjeevi

03:36 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Mala Mahanadu leader shocking comments about Chiranjeevi

అవును మీరు చూసింది నిజమే.. మెగాస్టార్ చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వరట. ఎందుకో తెలియాలంటే అసలు మేటర్ లోకి వెళ్ళాల్సిందే.. ఎస్సీ వర్గానికి మద్దతు పలికిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవిని తెలుగు రాష్ట్రాల్లో తిరగనివ్వమంటూ మాల మహానాడు సోమవారం ఆందోళన చేపట్టింది. ట్యాంక్‌ బండ్‌ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

రాజకీయం చేతకాక పార్టీని అమ్ముకున్న చిరంజీవి ఎస్పీ వర్గీకరణకు సిఫారసు చేయడం చేతగాని తనమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తప్పుబట్టారు.

English summary

Mala Mahanadu leader shocking comments about Chiranjeevi