విడాకులకు సిద్దపడిన 'పవన్‌' ఐటమ్‌ గర్ల్

Malaika Arora ready to take divorce

05:26 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Malaika Arora ready to take divorce

బాలీవుడ్‌ లో ఈ మధ్య విడాకుల ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇటీవల ప్రముఖ నటుడు హృతిక్రోషన్-సుజానే విడిపోయారు. ఫర్వాన్‌ఖాన్‌-అధునలు కూడా కొన్ని రోజుల క్రితమే విడిపోయారు. ఇప్పుడు మరో జంట విడాకులకు సిద్ధపడుతున్నారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నయ్య మరియు ప్రముఖ నటుడైన అర్బాజ్‌ఖాన్‌, అతని భార్య మలైకా అరోరా విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతవారం తన కుమారుణ్ణి తీసుకుని ఇంటినుండి వెళ్ళిపోయింది. తన సోదరి అమృత అత్తమామలు నివసిస్తున్న ఖర్‌ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌ లో ఉందని సమాచారం. గతకొంత కాలంగా మలైకా బ్రిటన్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తుందని సమాచారం.

ఈ విషయం పై అర్బాజ్‌ఖాన్‌, మలైకా ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారనే వార్తలు వినపిస్తున్నాయి. మలైకా పవన్‌ 'గబ్బర్‌సింగ్‌' సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే.

English summary

Bollywood item girl Malaika Arora ready to take divorce with her husband Arbaaz Khan. He is one of the star in bollywood. He acted in Chiranjeevi's telugu movie 'Jai Chiranjeeva' movie as a villan.