ట్రంప్ వ్యాఖ్యలు విద్వేషపూరితం: మలాలా

Malala Opposes Donald Trump's Words

05:54 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Malala Opposes Donald Trump's Words

ముస్లింలను అమెరికాలోకి రానివ్వొద్దన్న అమెరికన్ నాయకుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను పాకిస్థానీ బాలిక, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యుసఫ్‌జాయ్ ఖండించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్ ఇటీవల ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని మలాలా పేర్కొన్నారు. ఉగ్రవాద నెపంతో ఒక్క ముస్లింల పైనే నింద వేస్తే అది మరింత మంది ఉగ్రవాదులను తయారు చేస్తుందని మలాలా అన్నారు. పెషావర్‌లో స్కూల్‌పై ఉగ్రదాడి జరిగే ఏడాది అయిన సందర్భంగా ఆమె లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు వివక్షను చూపుతున్నాయని, ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం మీ ఉద్దేశమైతే, కేవలం ముస్లిం ప్రజలను నిందించకండి, ఎందుకంటే అది ఉగ్రవాదాన్ని ఆపలేదని మలాలా అన్నారు. ఉగ్ర ఆలోచనల్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా సరైన విద్యను అందించాలని ఆమె సూచించారు.

English summary

Nobel prize winner Malala Yousafzai Oposes American Republic Party Leader Donald Trumph's words and banning pakistan people in USA