సిగరెట్‌ కాలుస్తూ దొరికిపోయిన ఎవడే సుబ్రహ్మణ్యం హీరోయిన్‌!!

Malavika Nair smoking cigarettes in Kalyana Vaibhogame movie

03:09 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Malavika Nair smoking cigarettes in Kalyana Vaibhogame movie

ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నాని సరసన నటించిన కొత్త నటి 'మాళవిక నాయర్‌'. ఆ చిత్రంలో అమ్మడు నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు తాజాగా అలా మొదలైంది ఫేమ్‌ నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్య సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని ఇటీవలే విడుదల చేశారు. సినిమాలో నటించిన ముఖ్యపాత్రలందరినీ పెళ్లయ్యాక ఒక సెల్ఫీగా తీసుకునే ఫోటోనే ఫస్ట్‌లుక్‌ గా విడుదల చేశారు, ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో మాళవిక చేస్తున్న పాత్రపేరు ఆనంది (ఎవడే సుబ్రహ్మణ్యం లో పాత్ర పేరు కూడా ఆనందినే), మాళవిక క్యారెక్టర్‌ బాగా ఇంపార్టెంట్‌ అని దర్శకురాలు చెప్పారు.

ఈ చిత్రంలో ఆనంది పాత్ర నటనకి ఆస్కారమున్నందువల్లే మాళవిక నాయర్‌ని ఎంచుకున్నారు. ఇందులో మాళవిక పాత్ర సిగరెట్స్‌ కూడా కాలుస్తుందట, అంటే యాక్టింగ్‌ కోసం తను ఏం చెయ్యడానికైనా సిద్ధమే అని తెలుస్తుంది.

English summary

Malavika Nair smoking cigarettes in Kalyana Vaibhogame movie which was directing by Nadini reddy. In this movie Naga Shourya is playing a lead role as a hero.