కళాభవన్‌ మణి మృతికి అసలు కారణం

Malayalam actor Kalabhavan mani was murdered

01:27 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Malayalam actor Kalabhavan mani was murdered

సినీరంగంలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు కళాభవన్‌ మణి. ఇతడి మరణం సహజం కాదు అని ఇటీవల వార్తలు వచ్చాయి. అతడి మరణం వెనుక మిస్టరీ కొనసాగుతూనే ఉంది.

45 ఏళ్ళ ప్రముఖ మలయాళ సినీనటుడు మణి హఠాత్మరణం చాలా అనుమానాలకు దారి తీస్తుంది. ఇతడి మరణం కొత్త కోణం వైపు దారితీస్తుందని పోలీసులు భావిస్తున్నారు. విషపూరితమైన ఆల్కహాల్‌ను కళాభవన్‌ తాగి ఉంటాడని, ఎవరో కావాలనే ఈ విధమైన విషప్రయోగం జరిపి ఉంటారని పోలీసులు అంటున్నారు. కళాభవన్‌ కి కేవం బీరు మాత్రమే తాగే అలవాటు ఉందని మణి మేనేజర్‌ కేరళ పోలీసులకు తెలిపారు.

కల్తీ నాటు సారా సేవించడం వల్ల మరణాలు సంభవిస్తాయని కళాభవన్‌ మణి రక్తంలో హానికరమైన మిథనాల్‌ ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు వాపోయారు. మలయాళ మణికి కాలేయ సంభంధిత వ్యాధి ఉండడం వలన బహుశా చనిపోయిఉండవచ్చని పోలీసు అధికారులు అంటున్నారు. విషప్రయోగం కూడా జరిగి ఉండవచ్చని దానికి ఆధారాలు కూడా లేకపోలేదని వాళ్ళు తెలిపారు. ఏది ఏమైనా సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది అని అటు మలయాళం ఇటు తమిళనాడు సినీ వర్గాలు సైతం సంతాపం తెలిపాయి

English summary

Malayalam actor Kalabhavan mani was murdered. South film industry was in shock after hearing the news of Malayalam actor Kalabhavan Mani‘s untimely death.