నటి రేఖా మోహన్ మరణం వెనుక మిస్టరీ..!

Malayalam actress Rekha Mohan death mystery

12:44 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Malayalam actress Rekha Mohan death mystery

ఇటీవలే తమిళ నటి సబర్ణ చెన్నైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముగియక ముందే మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కేరళలోని త్రిసూర్ లో రేఖ ఉంటున్న అపార్ట్మెంట్ లో ఆమె మృతదేహాన్ని శనివారం గుర్తించారు. పలు మళయాళ మూవీలు, టీవీ సీరియల్స్ లో రేఖా మోహన్ నటించింది. కాగా.. ఆమె ఇంటికి దూరంగా మరోచోట ఉన్న రేఖ భర్త రెండు రోజులుగా ఆమెను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. అనుమానం వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి.. తలుపులు పగులగొట్టి చూడగా లోపల రేఖ డెడ్ బాడీ కనిపించింది.

ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Malayalam actress Rekha Mohan death mystery