సింధు పతకంపై ఉమ్మేస్తే ... డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Malayalam Director Sasidharan Comments On PV Sindhu

12:14 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Malayalam Director Sasidharan Comments On PV Sindhu

రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచి, భారతదేశంలో సంతోషం నింపిన పి.వి.సింధు మీద నజరానాల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమెకు జరుగుతున్న సన్మానాలు.. సత్కారాలు.. ఆమెకు లభించిన స్వాగతం సరేసరి. అయితే వీటిపై జనాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమెకు ఆ గౌరవం సముచితమే అంటారు కొందరు. ఐతే మరీ ఇంతగా స్పందించాలా.. సంబరాలు చేసుకోవాలా.. ఆ స్థాయిలో కానుకల వర్షం కురిపించాలా అంటుంది ఇంకో వర్గం. ఐతే నిర్మాణాత్మక చర్చ అవసరమే కానీ, ఐతే మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మాత్రం ఈ విషయంలో కొంచెం తీవ్రంగా స్పందిస్తూ, సింధుకు లభిస్తున్న ఆదరణపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

సింధు విజయం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?'' అని శశిధరన్ ప్రశ్నించాడు. ఈమేరకు ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. సింధు పతకం మీద నేను ఉమ్మేస్తే ఏం జరుగుతుంది' అని అతను వ్యాఖ్యానించాడు. ముందు రెండు వ్యాఖ్యల విషయంలో ఎవరికీ అభ్యంతరాల్లేవు కానీ.. ఈ ఉమ్మేస్తే అనే కామెంటే నెటిజన్లకు చిరాకు తెప్పించింది. కేరళకు చెందిన క్రీడాభిమానులు సైతం శశిధరన్ మీద విరుచుకుపడ్డారు. ఐతే తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో, తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదంటూ శశిధరన్ వివరణ ఇచ్చాడు. అయినా, ఆ డైరెక్టర్ ని నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:సింధు కి సూపర్ గౌరవం - మాంచి ఆఫర్

ఇవి కూడా చదవండి:జబర్ధస్త్ వినోదిని గురించి తెలిస్తే షాకవుతారు!

English summary

Malayalam Director Sasidharan made some controversial comments on Badminton Star and Olympic Silver Medalist PV Sindhu by saying that what happens if he splits on Sindhu Silver Medal.