మరో హీరోయిన్ కూడా విడాకులు

Malayalam Heroine Divya Unni To Take Divorce

10:55 AM ON 18th August, 2016 By Mirchi Vilas

Malayalam Heroine Divya Unni To Take Divorce

ఈమధ్యకాలంలో అమలా పాల్ విడాకులకు సంబందించిన విషయం అటు సినీ వర్గాల్లోనూ - ఇటు సామాన్య ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారి, ఇంకా సమసిపోక ముందే, మరో మాజీ హీరోయిన్ తన భర్త నుంచి డైవర్స్ కోరుతోంది. మళయాళి నటి - డాన్సర్ అయిన దివ్య ఉన్ని, తన భర్త డాక్టర్ సుధీర్ సుధాకరన్ నుంచి విడిపోతోందని వార్తలొస్తున్నాయి. పెళ్లై ఇప్పటికి సుమారు 14 సంవత్సరాల కాబోతున్నా తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడంతో ఇప్పుడు మళయాళి సిని పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అయితే, దివ్య ఉన్ని భర్త నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. భర్త సుధీర్ అక్రమ సంబంధం - అతనికున్న ఈగో విడాకులకు దారితీసిందని అంటుంటే, కెరీర్ పై దృష్టిపెట్టనివ్వడంలేదనేది మరోకారణంగా చెబుతున్నారు.

మలయాళీ నటి - డాన్సర్ అయిన దివ్య ఉన్నై.. తెలుగు - తమిళ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో వేణు హీరోగా వచ్చిన ఇల్లాలు.. ప్రియురాలు మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే చిన్నప్పటినుంచి డాన్స్ పైనా - నటన పైనా ఆసక్తి ఉన్న దివ్య.. తాజాగా డాన్స్ స్కూలు పెట్టిందట. ఈ వ్యవహారం తన భర్తకు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. నటన - డాన్స్ అంటూ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేస్తుందని - ఇంట్లోనే ఉండమని భర్త చాలాసార్లు ఆదేశించాడట కూడా. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన దివ్య.. కుటుంబం కోసం ఇప్పటివరకూ చాలా త్యాగాలు చేసానని - ఇక తన వల్ల కాదని చెప్పిందట. ఇదే సమయంలో డాన్స్ స్కూల్ మూసేయటం కుదరదని కూడా స్పష్టంగా చెప్పడంతో ఇక విడాకులే అని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై ఇరు వైపులకు చెందిన కుటుంబాల వారు ఎంత రాజీకి ప్రయత్నించినా, వీరిద్ధరిలో ఏ ఒక్కరు వెనక్కి తగ్గకపోవడంతో, విడాకులకు అప్లై చేయాల్సి వచ్చిందట. దీంతో ఇక ఆ కార్యక్రమం కూడా పూర్తయితే తిరిగి సినిమాల్లోకి రావాలని దివ్య ఉన్ని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే భర్త ఇంటినుంచి వచ్చేసిన దివ్య.. కొడుకు అర్జున్ కూతురు మీనాక్షి లతో పాటు తన తల్లితండ్రులతోనే ఉంటుంది. కాగా దివ్య ఉన్న తన ఏడో ఏట నుంచే నుంచే సినిమాల్లో నటిస్తూ డాన్స్ అంటే ఆసక్తి చూపించేదని ఇలాంటప్పుడు ఆమెను నటనకు - డాన్స్ కు దూరం చెయ్యటం అన్యాయం అని దివ్య కుటుంబసభ్యులు అంటున్నారు. మొత్తానికి ఈ యవ్వారం విడాకులకు వెళ్ళింది.

ఇవి కూడా చదవండి:కృష్ణ వంశీ వాడకం అలానే వుంటుందట

ఇవి కూడా చదవండి:దీపాకు ఖేల్ రత్న ఇవ్వబోతున్నారా!

English summary

Malayalam Movie Heroine Divya Unni was a good dancer and she was acted in some Telugu,Tamil films. She was married to a doctor on 14 years ago and now she decided to ake divorce from her husband due to some problems occured with her husband.