కమలం గూటికి సూపర్ స్టార్

Malayalam Superstar Suresh Gopi Joins BJP

11:06 AM ON 20th October, 2016 By Mirchi Vilas

Malayalam Superstar Suresh Gopi Joins BJP

ఇప్పటికే పలువురు నటులు ,సెలబ్రిటీలు బీజేపీలో చేరగా, తాజాగా మరో సూపర్ స్టార్ బీజేపీలో చేరాడు . ఇప్పటి వరకు ఆ పార్టీకి పరోక్షంగా మద్దతిస్తున్న ఆయన చేరిక విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 200లకు పైగా సినిమాల్లో నటించిన మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపీ, మే నెలలో జరిగిన కేరళ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశాడు. అయితే ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేసేందుకు నిరాకరించినప్పటికీ, బీజేపీ అభ్యర్థి అయిన క్రికెటర్ శ్రీశాంత్ తరుఫున ఆయన ప్రచారం చేశారు. 57 ఏళ్ళ సురేష్ గోపీని ఈ ఏడాది ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యునిగా బీజేపీ నామినేట్ చేసింది. అయితే ఓ కళాకారునిగా మాత్రమే తాను చట్టసభలో ప్రవేశించానని, దీన్ని రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఆయన అన్నారు. చివరకు సురేష్ గోపీ అధికారికంగా బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సురేష్ గోపికి మిఠాయి తినిపిస్తున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన చేరికతో కేరళలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని నక్వీ ఆకాంక్షించారు.

ఇది కూడా చూడండి: మీ పేరులోని మొదటి అక్షరం బట్టి మీరు ఎంత రొమాంటిక్కో చెప్పొయొచ్చు!

ఇది కూడా చూడండి: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడో తెలుసా?

ఇది కూడా చూడండి: కలలో మిమ్మల్ని పాము కాటేసినట్లు వస్తే మీకు ఏమౌతుందో తెలుసా?

English summary

Malayalam Superstar Suresh Gopi Joins BJP.