రాజ్ తరుణ్ ను తెగ పొగిడేస్తున్నమలయాళీ ముద్దుగుమ్మ

Malayali Heroine Praises Raj Tarun

10:06 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Malayali Heroine Praises Raj Tarun

శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స పతాకంపై ఎస్‌. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీశ దుగ్గిశెట్టి నిర్మించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రంలో నాయికగా చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ పేరు అర్థన బిను. శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా అర్థన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ మలయాళీ అమ్మాయిని అయిన తాను బి.ఎ. జర్నలిజం చేస్తున్నాన ని చెప్పింది. ఇది కొత్త కథతో చేసిన సినిమా అనలేం కానీ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా అని చెబుతూ,ఇందులో తన పాత్ర పేరు సీతామాలక్ష్మి అని చెప్పుకొచ్చింది. సింపుల్‌గా ఉండే మోడరన్ సీత అట. కేవలం పాటలకు పరిమితమయ్యే పాత్ర కాదు. టైటిల్‌లో ఉన్నట్లు కథలో నాదీ కీలక పాత్రే కనుక ఈ సినిమా ఒప్పుకున్నాన ని అంటోంది. ' ఇక్కడకు రాకముందు తెలుగు నుంచి మలయాళంలో డబ్‌ అయిన కొన్ని సినిమాలు చూశాను కానీ, డైరెక్ట్‌ తెలుగు సినిమా చూడలేదు. రాజ్‌తరుణ్‌ చక్కని సహ నటుడు. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తనకెలా కావాలో అలా నా నుంచి నటనను రాబట్టుకున్నారు’’ అంటూ వివరించింది. ఇక నటన విషయంలో, సంభాషణల విషయంలో రాజ్‌తరుణ్‌ సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయట. ' మొదట్లో అతని ఎనర్జీ లెవల్స్‌ చూసి ఆశ్చర్యపోయా. అతనికి మ్యాచ్ కావడానికి కాస్త కష్ట పడాల్సి వచ్చింది. మా జంటను ప్రేక్షకులు ఇష్టపడతారని భావిస్తున్నా’ అని చెప్పే అర్చన కోరిక నెరవేరాలని ఆశిద్దామా.

English summary

Young Hero Raj Tarun's upcoming film "Seethamma Andalu - Ramayya Sitralu" movie was going to be released on 29th of this month.In this film Malayali heroine Ardana Binu acted as heroine and she syas that this movie was family entertainer and she says that Raj Tarun was nice guy and he was very energetic in the film sets also