నయనతారని అరెస్ట్‌ చేసిన మలేషియా పోలీసులు

Malaysian Police innterogated Nayanthara

04:54 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Malaysian Police innterogated Nayanthara

సౌత్‌ లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న నయనతార కి మలేషియా ఎయిర్‌పోర్ట్‌ లో ఘోర అవమానం ఎదురైంది. వివరాల్లోకెళితే విక్రమ్‌ హీరోగా నటిస్తున్న ఇరుముగన్‌ చిత్రంలో నిత్యమీనన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా నయనతార ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఘాటింగ్‌ మలేషియాలో జరుగుతుంది. తన పోర్షన్‌ ఘాటింగ్‌ కోసం మలేషియా వెళ్లిన నయనతార పాస్‌పోర్ట్‌లో తన పేరు తప్పు పడడంతో మలేషియా పోలీసులు ప్రశ్నించారు. తన స్క్రీన్‌ నేమ్‌ నయనతార పేరే పాస్‌పోర్ట్‌లో ఉంది. అయితే నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్‌.

దీనితో అక్కడ పోలీసులకి అనుమానం రావడంతో నిన్న (ఫిబ్రవరి 4) రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌ లోనే ఉంచి ఇంటరోగేట్‌ చేశారు. దీనితో చేసేది లేక ఆ చిత్ర సిబ్బంది వచ్చేంత వరకు నయనతార పోలీసులతోనే ఉండాల్సి వచ్చింది.

English summary

Malaysian Police innterogated Nayanthara due to passport verification in Malaysia airport.