లైంగిక వేధింపుల కేసు మగాళ్ళూ పెట్టచ్చు..

Male Students also can File Sexual Harassment Complaints

10:52 AM ON 9th June, 2016 By Mirchi Vilas

Male Students also can File Sexual Harassment Complaints

అవునా, అయితే ఇదేదో ఆలోచించాల్సిందే ... ఎందుకటే ఆమె లైంగిక వేధింపులకు గురిచేస్తుందంటూ ఓ మగాడు పోలీసులను ఆశ్రయించడం అరుదు గా వుంటుంది. ఒకవేళ అలా ఎవరైనా ఫిర్యాదు చేసినా వాళ్లని వింతగా చూడ్డం.. మహిళ మగాడ్ని లైంగిక వేధింపులకు గురిచేయడమేంటని లైట్ తీసుకున్న సందర్భాలున్నాయి కూడా. అయితే, విద్యాసంస్థల్లో మగాళ్లు లైంగిక వేధింపులకు గురైతే కేసు పెట్టేందుకు వెసులుబాటు కల్పిస్తూ యుజిసి(యూనివర్శిటి గ్రాంట్స్ కమిషన్) తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక ఇంటర్నల్ కమిటిని ఏర్పాటు చేయనుంది. ఇటీవల కాలంలో తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ పలువురు విద్యార్థులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో యుజిసి ఈ నిర్ణయం తీసుకుంది.

ఆడాళ్లు, లేదా ట్రాన్స్ జెండర్స్ ద్వారా లైంగిక వేధింపులకు గురైన వ్యక్తి తన ఫిర్యాదును తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో తప్ప మూడునెలల్లోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సదరు ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి నెలరోజుల్లోగా యాక్షన్ తీసుకుంటారు. ఒక వేళ బాధితుడు ఫిర్యాదు చేసేందుకు శారీరకంగా, మానసికంగానూ సిద్ధంగా లేకపోయినా, లేదా చనిపోయినా బాధితుడి తరపున బంధువులు, ఫ్రెండ్స్..ఇలా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ ఫిర్యాదులో నిజంలేదని తేలితే, ఫిర్యాదు దారుడిపై ఫైన్ తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ, ఇలాంటి కేసుల్లో యూనివర్శిటీ అధికార్లు సరిగా స్పందించకపోతే, వాటికిచ్చే గ్రాంట్స్ కూడా నిలుపుదల చేస్తామని యుజిసి పేర్కొంది.

ఇది కూడా చూడండి: శ్రియకే బాలయ్య ఓటు పడిందట..

ఇది కూడా చూడండి:ఎక్సర్సైజ్ లతో దంచేస్తున్న ఉపాసన..

ఇది కూడా చూడండి:లగ్జరీ కార్లను ఇలా పడేస్తారట!

English summary

Male Students also can File Sexual Harassment Complaints