టీ20 వరల్డ్ కప్ లో లంక కెప్టెన్ మలింగ

Malinga As Captain For Srilanka In T20 World Cup

10:30 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Malinga As Captain For Srilanka In T20 World Cup

త్వరలో జరగనున్న టీ20 ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ లో పాల్గొనే శ్రీలంక క్రికెట్ జట్టుకు స్టార్ పేసర్ లసిత్ మలింగ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు లంక సెలక్టర్లు గురువారం లంక టీమ్ ను ప్రకటించారు. మలింగ గాయం కారణంగా గత ఏడాది నవంబర్ నుంచి ఒక మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయితే మెగా టోర్నీలు కావడంతో టీమ్ కు మలింగకే సారథ్య బాధ్యతలు అప్పగించారు సెలెక్టర్లు. కులశేఖర, హెరాత్‌ తిరిగి టీమ్ లోకి వచ్చారు. మలింగ కెప్టెన్సీలోనే శ్రీలంక తొలిసారి 2014లో టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అయితే ఇండియా టూర్ లో సత్తా చాటిన కసున్‌ రజితకు టీమ్ లో చోటు దక్కలేదు. యువ క్రికెటర్లు డిక్వెల్లా, శనక, చమీరాలకు మాత్రం ప్లేస్ దక్కింది.

లంక వరల్డ్ కప్ టీమ్ ఇదే..

మలింగ(కెప్టెన్‌), మాథ్యూస్‌, చండిమాల్‌, దిల్షాన్‌, డిక్వెల్లా, షేహాన్‌ జయసూర్య, సిరివర్ధనె, శనక, చమీరా, కులశేఖర, దుష్యంత్‌, తిసార ఫెరీరా, సేననాయకె, హెరాత్‌, జఫ్రీ

English summary

Srilanka Fast Bowler Lasith Malinga, who missed the New Zealand series due to injury, has been named as skipper of the Sri Lankan team for the Asia Cup and World Twenty20. Nuwan Kulasekara and Rangana Herath were also also return to the Srilankan Team.