కల్తీ మద్యం కేసు -   మల్లాది  అరెస్టు 

Malladi Vishnu Arrest

09:27 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Malladi Vishnu Arrest

ఎట్టకేలకు విజయవాడ కృష్ణలంక కల్తీమద్యం కేసులో ఎ-9 నిందితుడుగా ఉన్న విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గురువారం రాత్రి 11.15 సమయంలో అరెస్ట్‌ చేసింది. ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను కూడా అరెస్టు చేసింది. గత డిసెంబర్ లో స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి , 5గురు మరణించగా , 20 మంది వరకు అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. ఈ ఘటన తర్వాత రెండు రోజులపాటు అందుబాటులోనే ఉన్న విష్ణు ఆతర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళారు.

తొమ్మిదవ ముద్దాయిగా విష్ణు ని చేర్చి , కేసు కట్టారు. కల్తీ మద్యం విషయంలో ప్రత్యర్ధుల కుట్ర వుందని అప్పట్లో ఆరోపించిన విష్ణు మూడు రోజుల క్రితం అజ్ఞాతం వీడి ఇంటికి చేరిన తర్వాత అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. విష్ణు ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల పాటు సిట్ విచారణ విచారించిన అనంతరం అరెస్టు చేసింది. ఈ కేసులో వీరి పాత్రపై బలమైన సాక్ష్యాధారాలు లభించడంతో అరెస్ట్‌ చేసినట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. విష్ణు అరెస్టు విషయం తెల్సి , ఆయన అనుచరులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌ చుట్టూ గుమిగూడారు. శుక్రవారం వీరిని కోర్టులో హాజరు పరచి కస్టడీ కోరనున్నట్లు తెలిసింది.

English summary

The main accused person in vijayawada krishnalanka swarna bar adulterated alcohol Ex-MLA malladi vishnu was arrested by police yestersday night at 11:15 pm