అసలే 'కల్తీ మద్యం' ఆ పై  'కాల్ మనీ' 

Malladi Vishnu Hand In Call Money Incident

06:36 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Malladi Vishnu Hand In Call Money Incident

ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఇరుక్కున్న కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎంఎల్ఎ మల్లాది విష్ణు తాజాగా కాల్ మనీ వ్యవహారంలో కూడా ఈయన పేరు వినిపిస్తోంది. విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి 5గురు మరణించగా , 20మంది అస్వస్తులై, కోలుకుంటున్న సంగతి తెల్సిందే.

ఈ కేసులో ఎ-9ముద్దాయిగా నమోదైన విష్ణు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పరారీలో వున్న విష్ణు ఓడిశా లో దాక్కున్నట్లు తెలియడంతో ఆక్కడికి కూడా పోలీసు బృందాలను పంపారు. ఇదిలా వుంటే కాల్ మనీ వ్యవహారం కూడా విష్ణుని వెంటాడుతోంది.

కాల్ మనీ వ్యవహారంలో బాధితులు పోలీస్ స్టేషన్ ముందు క్యూ కడుతుంటే , ఒక్కొక్క అరాచకం బయట కు వస్తోంది. ఈ వ్యవహారంలో ఏపీ అధికారపక్షమైన టీడీపీ తమ్ముళ్లు మొదలు.. కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చోటా బడా నేతల హస్తం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా సులోచన అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు.

మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ తమకు రూ.లక్ష అప్పుగా ఇచ్చి బదులుగా రూ.4లక్షలు వసూలు చేశారని.. తన ఇంటిని కూడా లాక్కున్నారంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. మల్లాది విష్ణు మీద అలాగే ఆయన అనుచరుడు గణేశ్ మీద విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ కు సులోచన ఫిర్యాదు ఇచ్చారు. దీంతో స్వర్ణబార్ ఇష్యూలో పీకల్లోతు కూరుకున్న విష్ణుకు కాల్ మనీ వ్యవహారం కూడా మరో పెద్ద ఎదురు దెబ్బే. సాగినన్నాట్లు ఏదైనా సాగుతుంది. బండారం బయట పడితే ఇదిగో ఇలాగే ఉంటుందని బెజవాడలో చెవులు కొరుక్కుంటున్నారు.

English summary

Ex-Mla Malladi vishnu recently in adulterated alchohol scam and now he is also in cal money incident