అజ్ఞాతం వీడిన  మల్లాది విష్ణు

Malladi Vishnu Returns Back To Vijayawada

05:55 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Malladi Vishnu Returns Back To Vijayawada

స్వర్ణ బార్ లో కల్తీ మద్యం ఘటనలో ముద్దాయిగా వున్న కాంగ్రెస్‌ నేత మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడి మంగళవారం ఉదయం విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు. విజయవాడ కృష్ణ లంక లోని స్వర్ణ బార్ లో డిసెంబరు 7న కల్తీ మద్యం సేవించి, 5గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం సృష్టించింది. కల్తీమద్యం ఘటనలో మల్లాది విష్ణు తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. సంఘటన జరిగిన రోజు మీడియాతో మాట్లాడినా , కేసు నమోదు అనంతరం మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విష్ణు మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్ష మయ్యారు.

ఈ సందర్భంగా విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, రేపు మీడియా ఎదుట అన్ని వివరాలు వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు.

English summary

Malladi Vishnu who was in the case of adulterated alcohol case in swarna bar in vijayawada. He says that he will give full information to police and he says that he will talk to media tomorrow