'క్రిస్మస్‌ బరిలో మామ అల్లుడు'

Mama Manchu-Alludu Kanchu To Release For Christmas

02:03 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Mama Manchu-Alludu Kanchu  To Release For Christmas

ఈ సంవత్సరం క్రిస్మస్‌ కు మూడు సినిమాలు బరిలో దిగనున్నాయి. ఇప్పటి వరకు గోపిచంద్‌ నటించిన 'సౌఖ్యం' , సుధీర్‌ బాబు నటించిన 'భలే మంచిరోజు' వంటి రెండు చిత్రాల విడుదలవుతాయని అందరు భావించారు. ఈ లిస్టు లో మరో సినిమా వచ్చి చేరింది , అదే మోహన్‌ బాబు, అల్లరి నరేష్‌లు నటించిన ''మామ మంచు - అల్లుడు కంచు'' చిత్రం . ఈ చిత్రం కూడా క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 25 న బరిలో దిగడంతో ఈ క్రిస్మస్‌కు త్రిముఖ పోటి తప్పేలాగా లేదు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ , సాంగ్స్‌కు మంచి ఆదరణ లభింస్తుంది. ఇప్పటికే నైజాం రైట్స్‌ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ మూడు చిత్రాలు ఒకే రోజున విడుదలవుతాయా లేదా అన్నది క్రిస్మస్‌ వరకు వేచి చూడాలి.

English summary

Mohan babu and allari naresh together acted in a film called Mama Manchu-Alludu Kanchu. This film is to be released on 25th december on the eve of Christmas festival