క్రిస్మస్ కి మామ...అల్లుడు...

Mamaa Manchu Alludu Kanchu releasing on Christmas

06:13 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Mamaa Manchu Alludu Kanchu releasing on Christmas

కలెక్షన్‌ కింగ్‌ డా. మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ హీరోలుగా కలిసి నటించిన చిత్రం "మామ మంచు అల్లుడు కంచు" ఈ చిత్రానికి 'ఢమరుకం' దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మోహన్‌బాబుకి జోడీగా రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అల్లరి నరేష్‌ సరసన పూర్ణ నటిస్తుంది. ఈ చిత్రం 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇది ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడుతుంది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాని చక్కగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు.

మోహన్‌బాబు ఇప్పటి దాకా 561 చిత్రాల్లో నటించారు. హీరోగా నాన్నగారికి ఇది 181వ చిత్రమని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాంతర కార్యక్రమాలు పూర్తికావచ్చాయని డిసెంబర్‌ 25న క్రిస్మస్‌కి విడుదల చేయబోతున్నామని తెలిపారు.

English summary

Mama Manchu Alludu Kanchu releasing on Christmas. Collection king Mohan Babu and Allari Naresh are both acting as a heros in "Mama Manchu Alludu Kanchu".