పశ్చిమ బంగాలో దీదీకే పట్టం - 27న మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం

Mamatha Banerjee again won as a CM

05:02 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Mamatha Banerjee again won as a CM

పశ్చిమ బంగాలో విజయం దిశగా దూసుకెళ్తున్న తృణమూల్‌. కాంగ్రెస్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి కార్యకర్తల కోలాహలం నెలకొంది. ఆమె మాత్రం నిండుకుండ తొణకదన్నట్లుగా కన్పించారు.. ముఖంలో ఎలాంటి భావాలూ లేవు. విజయం సాధించిన అతిశయం అస్సలు లేదు. ఈ విజయం తనకు రావాల్సిందేనన్నట్లు, వస్తుందని తనకు తెలుసన్నట్లు.. నిర్వికారంగా తనదైన శైలిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థులు తమ గురించి ఎన్నో అసత్యపు ప్రచారాలు చేసినప్పటికీ వాటిని నమ్మకుండా ప్రజలు తమను ఎన్నుకున్నారని, ప్రజల ఆనందంలోనే తన ఆనందం ఉందని పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బంగా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ భారీ మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో మమత మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో చాలా జరిగాయి.. ఎన్నో అబద్ధాలు చెప్పారు.. మమ్మల్నే లక్ష్యంగా చేసుకున్నారు.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రజలు ప్రజాస్వామ్య గొప్పదనాన్ని నిరూపించారు’ అని మమత చెప్పారు. కాగా ఈ ప్రజాస్వామ్య వేడుకలో అత్యంత ముఖ్యమైన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మే 27వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్లు మమత స్పష్టం చేశారు.

రేపు మధ్యాహ్నం 12.30కు పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం గవర్నర్‌ను కలుస్తానన్నారు. భారీ విజయాన్ని పురస్కరించుకుని మే 30వ తేదీ వరకు రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

English summary

Mamatha Banerjee again won as a CM