ఓ  తప్పు మొత్తం సంస్థనే డిలీట్‌ చేసేసింది!

Man accidentally deletes his entire company

10:30 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Man accidentally deletes his entire company

చిన్న తప్పే అనుకుంటాం ... కానీ అది పెద్ద ఇబ్బందిని సృష్టిస్తుంది... అందునా సాంకేతికంగా చిన్న తప్పు దొర్లితే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుండు. మనం కంప్యూటర్‌ను వినియోగించేప్పుడు ‘‘అన్‌ డూ’’, ‘‘కంట్రోల్‌-జడ్‌’’ ఆఫన్లు మనల్ని ఎన్నో సార్లు ఆదుకోవడం సహజంగా ఉండేదే. పొరపాటున తప్పు కొట్టినా , ఒకవేళ ఏదైనా మేటర్ తీసేసినా వెంటనే కంట్రోల్ జెడ్ కొడితే, యధాతధంగా వచ్చేస్తుంది. అనుకోకుండా ఓ తప్పు కోడ్ కొడితే, దాని పర్యవసానం చాలా పెద్దది. ఏకంగా ఓ సంస్థనే డిలీట్ చేసేసింది. తప్పు కోడ్ విలువ ఎంత అనేది మార్కో మర్సాలా అనే ఓ వెబ్‌హోస్టింగ్‌ కంపెనీ యజమానిని అడగితే తెలుస్తుంది. ఎందుకంటే ఓ తప్పు కోడ్‌ను ఎంటర్‌ చేయడంతో తన సంస్థ వెబ్‌సైట్‌తో పాటు తన కంపెనీ వినియోగదారుల వెబ్‌సైట్లు సైతం పూర్తిగా ఎరేజ్‌ అయిపోయాయి. ఈ కంపెనీ 1535 వినియోగదారుల వెబ్‌సైట్ల సర్వర్లను నిర్వహిస్తోంది. అయితే సాధారణంగా ఈ కమాండ్‌ను ఎంటర్‌ చేయగానే ఏ ఫైల్‌ డిలీట్‌ చేయాలో తన కంప్యూటర్‌ అడుగుతుందని, తాను కంగారులో ఈ ప్రశ్నకు కమాండ్‌ రాయకపోవడంతో తన కంప్యూటర్‌ అన్ని ఫైల్స్‌ను పూర్తిగా ఎరేస్‌ చేసిందని మర్సాలా చెబుతున్నాడు. ఓ తప్పు ఎంత డామేజ్ చేస్తుందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు .

ఇవి కూడా చదవండి:

అత్తతోనే సరసాలు.. మామకు తెలిశాక ఏం చేసాడో చూడండి?

నాగార్జున ఆస్తి ఎంతో తెలిస్తే షాకౌతారు!

దావూద్ అంత పెద్ద తోపు ఏమి కాదు

English summary

A Man accidentally deletes his entire company by writing wrong code . The name of that company was marco marsala. It has deleted his own site and also the 1535 websites which were hosting by them.