ఫేస్ బుక్ లో అభ్యంతరకరపోస్టులు.. మరి ఆమె ఏం చేసింది?

Man Arrested for Harassing Woman

10:55 AM ON 7th January, 2017 By Mirchi Vilas

Man Arrested for Harassing Woman

ప్రేమతో గెలుచుకోవడం కాకుండా వేధించడం, రాక్షసత్వంగా వ్యవహరించడం ద్వారా తమ కోరికలు తీర్చుకునే పైత్యం పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియా వేదికగా అతడు చేసిన చేష్టలు అతన్ని కటకటాల వెనక్కి నెట్టాయి. పధకం ప్రకారం పరిచయం ఏర్పరచుకొన్న యువతిని వేధించడమే కాకుండా ఫేస్ బుక్ లో అసభ్యకరంగా వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని ప్రబుద్దిడిని జవహర్ నగర్ పోలీసులు అరెస్టుచేశారు. అతనిపై రౌడీషీట్ ను కూడ ఓపెన్ చేశారు. పూర్తివివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా రామగుండం కు చెందిన పిజి చదివే ఓ విధ్యార్థిని తో అదే ప్రాంతానికి చెందిన జీవన్ శర్మ అనే యువకుడు పరిచయం పెంచుకొన్నాడు. ఆ తర్వాత ఆ యువతికి హైద్రాబాద్ లోని హెచ్ ఎస్ బి సి లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె అల్వాల్ మండంలోని మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో గల కౌకూర్ జనప్రియ అపార్ట్ మెంట్ లో ఉంటుంది.

రామగుండంలో ప్రైవేట్ కంపెనీని ఏర్పాటుచేసుకొని జీవన్ శర్మ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ యువతితో ఉన్న పరిచయం ఆధారంగా ఆ యువతి సెల్ ఫోన్ కు ప్రేమించాలని మేసేజ్ లు పంపుతూ వేధించేవాడు జీవన్ శర్మ. తనను వేధిస్తున్నాడని ఆ యువతి గత ఏడాది ఏప్రిల్ 9వ, తేదిన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో జీవన్ శర్మ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ వేధింపులకు తాళలేక ఆమె మరోసారి గత ఏడాది సెప్టెంబర్ 3న, పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు మరో సారి కేసు నమోదుచేసి రామగుండం పోలీసులకు చేరవేశారు. అయినా జీవన్ శర్మ లో మార్పు రాలేదు. పేస్ బుక్ లో ఆ యువతి సంబంధించిన వ్యక్తిగత విషయాలను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ మరింత వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ నెల మూడున ఐటి చట్టం ఐపిసి ప్రకారంగా కేసు నమోదుచేసి పోలీసులు ఆధారాలు సేకరించి ఆయనను అరెస్టుచేసి,రిమాండ్ కు తరలించారు.

ఇది కూడా చూడండి : 2017 లో మీ రాశిని బట్టి…. మీకు మంచి చేసే కలర్ ఇదే

ఇది కూడా చూడండి : ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

ఇది కూడా చూడండి : కొల్హాపూర్ లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం విశిష్టత ఏమిటో తెలుసా

English summary

In Hyderabad Man Arrested for Harassing Woman.