ఏటీఎం లో కత్తితో దాడి - దోపిడీ(వీడియో)

Man Attacked With Knife At ATM in Rajasthan

01:01 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Man Attacked With Knife At ATM in Rajasthan

నేరాలకు హద్దు లేకుండా పోయింది. నేరగాళ్ళు ఎక్కడబడితే అక్కడ స్వైర విహారం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ లోని జోద్ పూర్ లో ఓ ఏటీఎం లో జరిగిన దారణం చూస్తే గుండె గుభేల్ మంటుంది. అక్కడ క్యాష్ విత్ డ్రా చేసుకుంటున్న ఓ వ్యక్తిపై అక్కడే నక్కిన యువకుడొకడు కత్తితో దాడి చేశాడు. నాలుగు సార్లు పొడిచి డబ్బు లాక్కుని పారిపోయేందుకు యత్నించాడు. అయితే అలర్ట్ అయిన వ్యక్తి కేకలు పెడుతూ ఆ యువకుడ్ని వెంబడించగా.. స్థానికులు కూడా పరుగున వచ్చి అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దుండగుడి దాడి దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. కత్తి తో దాడి చేసిన యువకుడిని నవీన్ పరిహార్ గా గుర్తించారు. తనకెంతో డబ్బులు అవసరమై ఈ పని చేశానని నవీన్ అంటున్నాడు. అతని దాడికి గురైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏటీఎం లో డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండకపోతే, డబ్బూ పోతుంది ... ప్రాణాలు కూడా గాల్లో కలసిపోతాయి ... తస్మాత్ జాగ్రత్త ..

ఇవి కూడా చదవండి:ఇద్దరి ప్రాణాలు తీసిన కుక్క .(వీడియో)

ఇవి కూడా చదవండి:కుబేరుడికి సైతం దిమ్మతిరిగే ఖరీదైన పెళ్లి...

English summary

A Man attacked a man in ATM with Knife and stabbed with knife in his Stomach and tried to take money and later the thief was caught by the near by people and he was arrested by police.