టికెట్ రాలేదని ...

Man Attempts Suicide For Not Giving Ticket In GHMC Elections

06:52 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Man Attempts Suicide For Not Giving Ticket In GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్(జిహేచ్ఎంసి) ఎన్నికల్లో కీలక ఘట్టం ముగియడంతో అసలు తంతు మొదలైంది. పార్టీలను రెబెల్స్ బెడద వెంటాడుతుంటే , ఇది చాలదన్నట్లు టికెట్ రానివాళ్ళు పార్టీ కారాలయాల దగ్గర , నేతల ఎదుట అఘాయిత్యాలకు , నిరసన ప్రదర్శనలకు దిగడం పార్టీలకు తలనొప్పిగా మారింది.

గాంధి భవన్ సాఖిగా... ఆత్మహత్యా యత్నం

టిక్కెట్‌ దక్కలేదన్న ఆవేదనతో కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు గాంధీభవన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించ డం కలకలం రేపింది. కిషోర్‌ అనే నాయకుడు కుర్మగూడ డివిజన్‌ టికెట్‌ ఆశించాడు. తీరా పార్టీ అతడికి టికెట్ కేటాయించలేదు. దీంతో మనస్తాపం చెంది గాంధీభవన్‌ వద్ద కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. అక్కడున్న పలువురు కార్యకర్తలు రంగంలో దిగి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

బిజెపి ఎంఎల్ఎ నివాసం దగ్గర వీరంగం...

ఇక ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ నివాసం ఎదుట బిజెపి కార్యకర్తలు గురువారం ఆందోళన చేపట్టారు. చర్లపల్లి టిక్కెట్‌ ఆశించిన సుదర్శన్‌గౌడ్‌కు పార్టీ టిక్కెట్‌ దక్కలేదు. దీంతో ఆగ్రహించిన సుదర్శన్‌గౌడ్‌ మద్దతుదారులు ఎమ్మెల్యే కారును అడ్డుకొని అద్దాలను ధ్వంసం చేశారు. వీరంగం సృష్టించారు. హుటాహుటీన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులో తెచ్చారు. ఎమ్మెల్యే ప్రభాకర్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

English summary

Rebel Candidates Who were not get ticket in GHMC elections.One congress party leader was attempted to suicide.Some of the BJP leaders were protested at Uppal MLA NVSS.Prabhakar house