పెళ్లి చెయ్యలేదని తల్లిని సజీవ దహనం చేసిన కొడుకు

Man burns his mother for not getting him married

06:30 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Man burns his mother for not getting him married

తమిళనాడులో ఉన్న కోయంబత్తూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనకు ఇంకా ఎందుకు పెళ్ళి చేయలేదని ఆగ్రహంతో ఊగిపొయిన అతడు తాగిన మత్తులో కన్న తల్లినే మట్టుబెట్టాడు ఓ కొడుకు.కోయంబత్తూరు పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం కోయంబత్తూరుకు చెందిన 40 సంవత్సరాలు వయసున్న అమర్‌నాథ్ ఒక క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అమర్‌నాథ్ క్యాబ్ డ్యూటీ పూర్తి కాగానే రోజూ ఇంటికి తాగొచ్చేవాడు.

ఇవి కూడా చదవండి:ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిన అమ్మాయిలు డబ్బులు చాలక ఎం చేస్తున్నారో తెలుసా?

తనకు ఎందుకు పెళ్ళి చేయడంలేదని అతని తల్లిని నిత్యం చిత్రహింసలకు గురిచేసేవాడు. పచ్చి తాగుబోతు అయిన అమర్‌కు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు.ఇదే విషయమై అమర్ తన తల్లితో గొడవ పడ్డాడు. గత శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన అమర్ ఆదివారం ఉదయం 5 గంటల టైంలో అతని తల్లి నిద్రిస్తుండగా ఆమెను ఒక కుర్చీకి కట్టేసి ఆమె పై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసాడు.ఆమె కేకలు వేయడంతో అమర్ ఇంటికి వచ్చిన ఇరుగుపొరుగు వారు కాలిన గాయాలతో ఉన్నఆమెను స్థానిక కిల్పౌక్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే 70 శాతం కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రిలోనే ఆమె తుది శ్వాస విడిచింది.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమర్‌ పై కేసు నమోదు చేసి కటకటాల వెన్నక్కి పంపారు.

ఇవి కూడా చదవండి:దెయ్యాలు ఉన్నాయనడానికి రుజువు ఇదే

ఇవి కూడా చదవండి:అల్లుడితో అత్త రాసలీలలు

English summary

A Man in Chennai Burns his Mother alive for not doing marriage to him. This incident was occurred in Arumbakkam Area in Chennai. Police filed case on this incident and taken him into their Custody.